Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో ఏడవ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైంది. దసరా స్పెషల్ ఎపిసోడ్ గా ఆదివారం 7 గంటల నుంచే ఎపిసోడ్ మొదలైంది. అయితే పండుగ స్పెషల్ కదా ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమో అనుకున్నారు. కానీ పూజా మూర్తి (Pooja Murthy) ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. రెండు వారాల క్రితమే వైల్డ్ కార్డ్ (Wild Card) ఎంట్రీగా వచ్చిన పూజా మూర్తి ఈ రెండు వారాల్లో ఆట అంతగా ఆడలేదు కానీ హౌస్ మెట్స్ అందరితో బాగానే కలిసిపోయింది. కంటెంట్ ఇవ్వడం కోసం కావాలని గొడవలు పడటం లాంటిది అసలు చేయలేదు పూజా.
బహుశా అందుకే ఆమె ఆడియన్స్ లో రిజిస్టర్ అవలేకపోయింది కావొచ్చు. బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) లో పూజా రెండు వారాలు మాత్రమే ఉండగా ఈ రెండు వారాలకు ఆమె భారీ రెమ్యునరేషన్ అందుకుందని టాక్. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వారికి వారాల లెక్క రెమ్యునరేషన్ ఉంటుంది. పూజా మూర్తి కి వారానికి లక్షన్నర రెమ్యునరేషన్ తో డీల్ సెట్ చేసుకుందని టాక్. సో రెండు వారాలకు 3 లక్షల దాకా ఆమె పారితోషికం అందుకుందని తెలుస్తుంది.
పూజా రెండు వారాలకే ఎలిమినేట్ అవడం ఆమె బుల్లితెర ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. పూజా సీజన్ 7 లో ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అందుకే ఆమె కేవలం రెండు వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చింది. అయితే పూజాతో హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా వచ్చిన అర్జున్, అశ్విని ఆటలో ముందుకెళ్తున్నారు. అయితే పూజాతో పాటు భోలే శావలి (Bhole Shavali) కూడా డేంజర్ లోకి వచ్చాడు. కానీ పూజాని ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు.
Also Read : Yash Remuneration : 100 కోట్ల రెమ్యునరేషన్ తో K.G.F హీరో..!