Site icon HashtagU Telugu

Bigg Boss 7 : సోషల్ మీడియాలో 6 లక్షల ఫాలోవర్స్.. వారానికే ఇంటికెళ్లిన బిగ్ బాస్ కంటెస్టెంట్..!

Bigg Boss 7 Nayani Pavani Unfair Elimination

Bigg Boss 7 Nayani Pavani Unfair Elimination

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 నిజంగానే ఉల్టా పుల్టా అన్నట్టు ఉంది. ఈ సీజన్ మొదటి నుంచి క్రేజీగా అనిపిస్తుంది. ఐదు వారాల తర్వాత కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారం లోనే వారిలో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం నయని పావని ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లోకి వచ్చి వారమే కానీ నయని ఎలిమినేషన్ ప్రాసెస్ చూస్తే ఆమె కోసం హౌస్ మెట్స్ అంతా కూడా కంటతడి పెట్టారు.

అంతేకాదు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ అయిన నయని కి 6 లక్షల దాకా ఫాలోవర్స్ ఉన్నారు. వారిలో 10 పర్సెంట్ ఓటు వేసినా ఆమె ఎలిమినేట్ అయ్యేది కాదు. మరి ఎక్కడ తేడా జరిగిందో ఏమో కానీ నయని పావని ఎలిమినేషన్ అందరికీ షాక్ ఇచ్చింది. అశ్విని, నయని ఇద్దరు చివరి దాకా నామినేషన్స్ లో ఉండగా తను తప్పకుండా హౌస్ లో ఉంటానని అనుకున్న నయని ఎలిమినేషన్ ఆమెకే కాదు హౌస్ మెట్స్ కి షాక్ ఇచ్చింది.

హౌస్ లోకి వచ్చీ రాగానే ఒక్కరోజులోనే నామినేషన్స్ జరుగగా వీక్ డేస్ లో నయని బాగానే అలరించింది. మరి ఆడియన్స్ ఆమెను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారో ఏమో కానీ నయని పావని ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. స్టార్ మా కంటెస్టెంట్స్ కన్నా నయని బెటర్ అని కూడా కొందరు అంటున్నారు. ఏది ఏమైనా నయని ఎలిమినేట్ అయ్యింది. అంతేకాదు ఈ వారం మరో కంటెస్టెంట్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Also Read : Balakrishna : భగవంత్ కేసరి ఆ సీక్రెట్ దాచేసిన టీం..!