Site icon HashtagU Telugu

Bigg Boss 7 : గౌతం రీ ఎంట్రీ.. కాస్త ఓవర్ అయ్యింది బాసు..!

Bigg Boss 7 Gautham Re Entr

Bigg Boss 7 Gautham Re Entr

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో వీకెండ్ ఎపిసోడ్ హంగామా ఓ రేంజ్ లో ఉంది. సీజన్ 7 లో ఎపిసోడ్ ఎపిసోడ్ కి అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో లాస్ట్ సండే బిగ్ బాస్ సీజన్ 7 2.O అంటూ మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు. అంతేకాదు లాస్ట్ సండే గౌతం ని ఎలిమినేట్ చేస్తున్నాం అంటూ సీక్రెట్ రూం లో పెట్టారు.

మండే (Bigg Boss 7) నామినేషన్స్ వల్ల హౌస్ లోకి గౌతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. అశ్వద్ధామ వెనక్కి వచ్చాడు. తేనే పూసిన కత్తితో తన గొంతు కోశారంటూ పెద్దగా అరుచుకుంటూ గౌతం హౌస్ లోకి మళ్లీ వచ్చాడు. రావడం రావడమే శివాజి తనని కావాలని పంపించేశారని.. మీరు షార్ట్స్ మీద తిరగడం బాగాలేదని చెప్పాడు.

Also Read : ISB : ఉత్తమ బిజినెస్ స్కూల్ గా ఐ.ఎస్.బి ఎంపిక..!

సీక్రెట్ రూం (Secret Room) లో ఉన్నందు వల్ల బిగ్ బాస్ గౌతం కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఈ వారం అతను ఒక హౌస్ మెట్ ని డైరెక్ట్ గా నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు. అయితే గౌతం ఎవరిని నామినేట్ చేశాడు అన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

కొత్తగా వచ్చిన వారితో పాటుగా గౌతం ని కూడా పోటుగాళ్ల టీం గా చేశాడు బిగ్ బాస్ (Bigg Boss). పోటు గాళ్లు ఆటగాళ్ల మధ్య నామినేషన్ ఫైట్ ఆసక్తికరంగా సాగింది. ఫైనల్ గా ఈ వారం ఏడుగురు హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుండగా ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారన్నది చూడాలి.

We’re now on WhatsApp. Click to Join