Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగవ కెప్టెన్ గా గౌతం కృష్ణ గెలిచాడు. కెప్టెన్సీ కంటెండర్ రేసులో గెలిచి ప్రియాంకా, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, సందీప్, గౌతం లు కెప్టెన్సీ రేసులో ఉండగా వారిలోంచి కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేయాలి అన్నది మిగతా హౌస్ మెట్స్ నిర్ణయం మీద ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. దాని వల్ల మిగతా హౌస్ మెట్స్ చేతికి ఈ వారం కెప్టెన్ ఎవరిని చేయాలన్న డిసిషన్ వెళ్లింది.
బిగ్ బాస్ ఇచ్చిన మిర్చి దండని ఎవరైతే కెప్టెన్సీకి అనర్హులో వారి మెడలో వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రశాంత్ (Pallavi Prashanth), ప్రియాంకా, శోభా శెట్టిలకు మిర్చి దండలు పడ్డాయి. అయితే శివాజి ఒక్క దంద గౌతం మెడలో వెస్తే సందీప్, గౌతం మధ్య టై అయ్యేది కానీ అది కొనసాగించే అవకాశం ఇవ్వకుండా సందీప్ మెడలో మిర్చి దండ వేసి గౌతం కెప్టెన్ గా అయ్యేలా చేశాడు.
అలా గౌతం సీక్రెట్ రూం నుంచి వచ్చిన 3వ వారం కెప్టెన్ గా గెలిచాడు. గౌతం (Gautham) కెప్టెన్ గా ఎలా చేస్తాడు. ఈ వారం అతని కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో సందీప్, శోభా శెట్టిలు డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి వీరిద్దరిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు అన్నది చూడాలి. ఇప్పటివరకు జరిగిన ఏడు ఎలిమినేషన్స్ లో అందరు అమ్మాయిలే అవడం విశేషం. మరి ఈసారైనా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేస్తార లేదా అన్నది చూడాలి.
Also Read : Vikram: విక్రమ్ “తంగలాన్” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే