Site icon HashtagU Telugu

Bigg Boss 7 : కొత్త కంటెస్టెంట్స్ తో హౌస్ కలర్ఫుల్..!

Bigg Boss 7 Five New Contes

Bigg Boss 7 Five New Contes

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) ఈ ఆదివారం సరికొత్తగా సీజన్ 7 2.O అంటూ అలరించారు. ఐదు వారాలు నడిచిన బిగ్ బాస్ సీజన్ 7 ను ఆడియన్స్ లో మరింత క్రేజ్ తెచ్చేందుకు సీజన్ 7 సెకండ్ వెర్షన్ అంటూ ఐదుగురు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు. ప్రతి వారం లానే ఆదివారం నాడు ఎలిమినేట్ చేశారు. శుభ శ్రీ (Shubha Sri)ని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించిన బిగ్ బాస్ టీం గౌతం ని కూడా ఎలిమినేట్ చేశారు కానీ అతన్ని నాగార్జున సీక్రెట్ రూం లో ఉంచారు.

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss) లో కొత్తగా వచ్చిన ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ కి కొన్ని అధికారాలు ఇచ్చాడు బిగ్ బాస్. మొన్నటిదాకా ఎనిమిది మంది మాత్రమే హౌస్ లో ఉండగా కొత్తగా వచ్చిన ఐదుగురితో ఆట మరింత రసవత్తరంగా సాగనుంది. సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ నిజంగానే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు బిగ్ బాస్ టీం కష్టపడుతుంది.

Also Read : Baby Combination Duet : బేబీ కాంబో డ్యుయెట్ చేస్తున్నారు..!

సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కాగా సీజన్ 7 ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. హోస్ట్ గా నాగార్జున కూడా అదరగొట్టేస్తున్నారు. అలా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 ఈ వారం నుంచి సరికొత్త ఉత్సాహంతో రీ స్టార్ట్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 7 ఊహించని మలుపులతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఆదివారం ఎపిసోడ్ హంగామా చేయగా మండే అనగా ఈరోజు హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ వారం నుంచి ఆట నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.

We’re now on WhatsApp. Click to Join