Bigg Boss 7: ఇంట్లోకి అసలు ఇంటోళ్లు.. కన్నీళ్లు రానివాళ్లెవ్వరు..?

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో హౌస్ మెట్స్ అసలు ఇంటి వాళ్లు వచ్చారు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 01:44 PM IST

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో హౌస్ మెట్స్ అసలు ఇంటి వాళ్లు వచ్చారు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వస్తున్నారు. మంగళవారం ఎపిసోడ్ లో మొదట శివాజి (Shivaji) వాళ్ల అబ్బాయి రాగా అతన్ని డాక్టర్ గా పంపించి సర్ ప్రైజ్ చేశారు. ఇక సెకండ్ టైం అర్జున్ (Arjun) భార్య రాగా ఆమెకు శ్రీమంతం చేసి పంపించారు హౌస్ మెట్స్. ఆ టైంలో హౌస్ మెట్స్ అంతా కూడా చాలా ఎమోషనల్ అయ్యారు.

ఇక థర్డ్ అశ్విని వాళ్ల మదర్ హౌస్ లోకి వచ్చారు. ఆమె హౌస్ లో ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అన్న హింట్స్ ఇచ్చి వెళ్లారు. ఇక ఈరోజు మొదటి ప్రోమోలో గౌతం (Gowtham) వాళ్ల మదర్ వచ్చారు. కన్నయ్య కన్నయ్య అనుకుంటూ గౌతం ని ముద్దులాడారు. ఏ సీజన్ లో అయినా ఫ్యామిలీ వీక్ అంటే అది సూపర్ హిట్ అన్నట్టే.

Also Read : Victory Venkatesh : ఆ డైరెక్టర్ తో వెంకటేష్.. ఫ్యాన్స్ ఎదురుచూపులు ఇంకా ఎన్నాళ్లు..?

ముఖ్యంగా ఈ సీజన్ ఇప్పటికే సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ రాకతో షో మరింత ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 7 పదో వారం ఫ్యామిలీ మెంబర్స్ తో షో అంతా ఎమోషనల్ గా సాగుతుంది.

సీజన్ 7 లో అందరు ఆటతో పాటుగా పోట్లాట కూడా బాగా చేస్తున్నారు. హౌస్ మెట్స్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతుంది. మరోపక్క ఉండాల్సిన టైంలో అందరు కలిసిమెలిసి ఉంటున్నారు. నామినేషన్స్ టైంలోనే అందరు తమ పాయింట్స్ తో ఫైట్ చేస్తున్నారు. మిగతా టైం లో టాస్కుల్లో వారి పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join