Bigg Boss Season 6: బిగ్ బాస్ కంటెస్టెంట్లకు పెద్ద షాకిచ్చిన బిగ్ బాస్.. ఈ సీజనే వరస్ట్ అంటూ?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవల గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. అయితే పోల్చుకుంటే

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 07:08 PM IST

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవల గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. అయితే పోల్చుకుంటే ఈసారి సీజన్ లో ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది అని ప్రేక్షకులు అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ సీజన్ 6 మాత్రం నీరసంగా సాగుతోంది. గత సీజన్లో తో పోల్చుకుంటే చాలా ఘోరంగా సాగుతోంది. అంతే కాకుండా ఆరు వారాలు గడుస్తున్నా కూడా వారిలో టైటిల్ గెలిచి సత్తా ఉన్న కంటెంట్ ఎవరు? అన్నది అంచనా వేయలేకపోతున్నారు బిగ్ బాస్ ప్రేమికులు. ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో అంతో ఇంతో రేవంత్, గీతూ, బాలాదిత్య పర్వాలేదనిపిస్తోంది.

కానీ రేవంత్ తన నోటిదూల, పిచ్చి చేష్టలు, కోపంతో ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడు. ఇక గీతూ అయితే తన చేష్టలతో, తన మాటలతో ఇంటి సభ్యులనే కాదు చూసే జనాలను కూడా చిరాకు పెట్టిస్తోంది. గీతూ ప్రతీసారి సోది సోది అంటుంది. కానీ ఆమె చివరకు సోదిలా మారిందని తెలుసుకోలేకపోతోంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో గీతూ ప్రవర్తన చూస్తే టైటిల్ గెలవడం అన్నది పక్కన పెడితే టాప్ ఫైవ్ లో ఉంటుంది చెప్పవచ్చు అంటున్నారు ప్రేక్షకులు. మరోవైపు బాలాదిత్య ఎక్కువగా పొట్లాడలో గొడవలకి పోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. వీరి ముగ్గురిలో టైటిల్ గెలవాలి అన్న కసి కనిపిస్తోంది. కానీ మిగిలిన వారు ఏదో బస్ హౌస్ లో ఉన్నాము అంటే ఉన్నాము తిన్నాము అంటే తిన్నాము అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఆరు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడవ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏడో వారంలో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను అర్థం చేసుకోకుండా,తమకు నచ్చినట్టుగా చేస్తుండటం, నిర్లక్ష్యం వహించడంతో బిగ్ బాస్‌కు మండినట్టుంది. అప్పుడు బిగ్ బాస్ అందర్నీ గార్డెన్ లోకి రమ్మని పిలిచి మీరంతా ఇక్కడ ఉండాల్సిన పని లేదు.. వెళ్లే వాళ్లు బయటకు వెళ్లండి.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ రద్దు అని ప్రకటించాడు. అంతేకాకుండా ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటూ బిగ్ బాస్ గేట్ వాకిలి కూడా ఓపెన్ చేసి పెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే గత సీజన్లో ఎప్పుడూ కూడా ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లపై కోప్పడింది లేదు. కంటెస్టెంట్లే హౌస్ నుంచి వెళ్ళిపోతాము అని అన్నారు కానీ ఏకంగా బిగ్ బాస్ వెళ్లిపోమని ఎప్పుడు చెప్పలేదు. మరి ఇప్పటికైనా హౌస్ లోన్ సభ్యులు టాస్కుల విషయంలో సీరియస్ గా ఆడతారో లేదో చూడాలి మరి.