Pushpa-2 Teaser: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప-2 టీజర్ రెడీ!

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని గ్లింప్స్ రిలీజ్ చేయబోతోంది టీం.

  • Written By:
  • Updated On - March 20, 2023 / 06:05 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అప్ డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ ముందు నిరసనలు కూడా తెలిపారు. ‘‘వి వాన్ట్ పుష్ప2 అప్ డేట్’’ అంటూ హల్ చల్ కూడా చేశారు. కాగా  కొన్ని నెలల కిందటే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. దాదాపు 30 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ గ్లింప్స్ రిలీజ్ చేయబోతోంది టీం.

ప్రస్తుతం సుకుమార్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ టీజర్ మీద వర్క్ చేస్తున్నాడు. బన్నీ డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘పుష్ప-2’ షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే.. ఒక వెరైటీ కాన్సెప్ట్‌తో టీజర్ షూట్ చేశాడట సుకుమార్. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఈ టీజర్ ఉంటుందని సమాచారం. దీంతో పాటు బన్నీని ఒక సంచలన అవతారంలో చూపిస్తూ ఫొటో షూట్ కూడా చేసింది టీం. ఆ లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని సమాచారం. అయితే టీజర్, ఫస్ట్ లుక్ రెండూ రిలీజ్ చేస్తే మాత్రం బన్నీ అభిమానులకు పండగే. బన్నీ పుట్టిన రోజుకు ఒక రోజు ముందు వీటిని రిలీజ్ చేసే అవకాశముంది. అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ఫస్ట్ లుక్ రెడీ చేస్తున్నాడట సుకుమార్. కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇప్పటికే 1000 కోట్ల కుపైగా అమ్ముడుపోయినట్టు వార్తలు హల్ చల్ చేశాయి.

ఇక ‘పుష్ప2’ కోసం అల్లు అర్జున్ తెలుగులో ఇప్పటి వరకు ఏ హీరో తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతేడాది విడుదలైన ‘పుష్ప’ అద్భుత విజయం అందుకోవడంతో, ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఓ రేంజిలో పెంచినట్లు తెలుస్తోంది. ఆయనకు దేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్ నేపథ్యంలో నిర్మాతలు కూడా భారీగా డబ్బు ముట్టజెప్పేందుకు ఓకే చెప్పారట. ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం బన్నీ రూ. 125 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.