సంక్రాంతి (Sankranthi) బరిలో భారీ అంచనాల నడుమ మూడు పెద్ద చిత్రాలు (3 Big Movies) రాబోతున్న సంగతి తెలిసిందే. శంకర్ – రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ (Game Changer ) మూవీ జనవరి 10 న పాన్ ఇండియా గా పలు భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుండగా, జనవరి 12 న వెంకటేష్ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది. ఇక జనవరి 14 న బాబీ – బాలకృష్ణ కలయికలో తెరకెక్కిన డాకు మహారాజ్ ( Daku Maharaj) విడుదల కాబోతుంది. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది. ఈ రెండు చిత్రాలకు రెండు వారాలపాటు టికెట్ ధరలు పెంచుకునే ( Ticket Price Hike ) అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP Tour : ప్రధాని పర్యటన వేళ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
ఇక గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న అర్ధరాత్రి ఒంటిగంట షో (బెన్ఫిట్)కు టికెట్ రూ.600కు అమ్ముకోవచ్చని తెలిపింది. మిగతా 5 షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్ పై రూ.175, సింగిల్ స్క్రీన్లపై రూ.135 హైక్ ఇచ్చింది. 23వ తేదీ వరకూ రోజుకు ఐదు షోలకు హైక్ తో టికెట్స్ విక్రయించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డాకు మహారాజ్ రిలీజయ్యే జనవరి 12న ఉ.4 గంటలకు బెనిఫిట్ షో టికెట్ రేటును రూ.500గా నిర్ణయించింది. ఫస్ట్ డే నుంచి జనవరి 25 వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. వాటికి మల్టీప్లెక్సుల్లో టికెట్ పై రూ.135, సింగిల్ స్క్రీన్లపై రూ.110 హైక్ ఇచ్చింది. ఏ మూవీ తో పాటు గేమ్ ఛేంజర్ మూవీకి కూడా టికెట్ ధరలు కూడా పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఇలా సర్కార్ ఆదేశాలు ఇవ్వడం తో నిర్మాతలు , అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. కాగా ప్రభుత్వం ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారణ జరిపిన కోర్ట్ నిర్మాతలకు షాక్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ రేట్ల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ముందుగా 14 రోజుల వరకు టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతినివ్వగా, ఇప్పుడు కోర్ట్ ఆదేశాలతో 10 రోజుల వరకే టికెట్ ధరల పెంపు అనేది ఉండబోతుంది. ఈ తీర్పు నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది.