టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించారు అల్లు అర్జున్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాలో నటిస్తారా అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ పిరియాడికల్ మూవీగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందని, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తారనీ ప్రచారం జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని, ఇందులో ముగ్గురు విదేశీ నాయికలు ఉంటారని టాక్. మెయిన్ హీరోయిన్ గా మాత్రం జాన్వీ కపూర్ అని తెలుస్తోంది.
మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ మూవీలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారా? అనే ప్రశ్నకు క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు మరి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ అభిమానులకు ఇది నిజంగా ఒక పండగ లాంటి వార్త అని చెప్పాలి. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బన్నీ నెక్స్ట్ సినిమాల గురించి అభిమానులు కూడా ఎంతో ఎగ్జిట్ ఇంకా ఎదురు చూస్తున్నారు. అయితే బన్నీ పుష్ప మూవీ విడుదల అయ్యి దాదాపు మూడు నెలలు పూర్తి అయిన కూడా ఇప్పటివరకు నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అల్లు అర్జున్.