Site icon HashtagU Telugu

Bichagadu : బిచ్చగాడు సినిమాలో శ్రీకాంత్? అంతా ఓకే.. కానీ ఎందుకు క్యాన్సిల్ అయింది?

Bichagadu movie offer come to Hero Srikanth but it wont works in Telugu

Bichagadu movie offer come to Hero Srikanth but it wont works in Telugu

తమిళ సంగీత దర్శకుడు మరియు నటుడు విజయ్‌ ఆంటోని (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన మదర్ సెంటిమెంట్ మూవీ ‘బిచ్చగాడు'(Bichagadu). తమిళంలో సూపర్ హిట్ అవ్వడంతో 2016 లో తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. అమ్మ ఆరోగ్యం కోసం కోటీశ్వరుడు అయిన కొడుకు బిచ్చగాడిలా దీక్ష తీసుకోవడం అనే కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా తెలుగులో 100 రోజులు ఆడి సంచలనం సృష్టించిన డబ్బింగ్‌ చిత్రాల జాబితాలో స్థానం దక్కించుకుంది. అయితే ఈ సినిమాని తెలుగులో డబ్ చేయడానికంటే ముందు రీమేక్ చేయాలని భావించారట.

శ్రీకాంత్‌ (Meka Srikanth) హీరోగా ఈ సినిమాని తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు అతన్ని సంప్రదించడం కూడా జరిగింది. శ్రీకాంత్ తమిళ్ వెర్షన్ ‘పిచ్చైకారన్‌’ (Pichaikkaran) ప్రివ్యూ కూడా వేశారు. సినిమా శ్రీకాంత్ కి బాగా నచ్చడంతో నటించడానికి వెంటనే ఓకే చెప్పేశాడు. తమిళ్ వెర్షన్ కంటే తెలుగులో మరింత ఎమోషనల్ గా సినిమాని తెరకెక్కించాలని మేకర్స్ భావించారు. కానీ హీరో రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బంది రావడంతో ఆ ప్రాజెక్ట్ మొదటిలో ఆగిపోయింది.

శ్రీకాంత్ ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడం, బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వడంతో నిర్మాతలు రీమేక్ ఆలోచన పక్కన పెట్టేసి, డబ్ చేసి రిలీజ్ చేశారని సమాచారం. అయితే ఈ సినిమా ఆఫర్ శ్రీకాంత్ వద్దకి రావడానికి గల కారణం విజయ్ ఆంటోనీ అండ్ శ్రీకాంత్ మధ్య స్నేహం. శ్రీకాంత్ నటించిన ‘మహాత్మా’ సినిమాకి విజయ్ ఆంటోనీ సంగీతం అందించాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే బిచ్చగాడు ఆఫర్ తన వద్దకి వచ్చిందని శ్రీకాంత్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా శ్రీకాంత్ చేసి ఉంటే ఎలా ఉండేదో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల బిచ్చగాడు 2 కూడా వచ్చి మంచి విజయం సాధించింది.

 

Also Read : Mrunal Thakar : వామ్మో.. మృణాల్ అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందా?