Site icon HashtagU Telugu

Manchu Manoj : తండ్రైన మంచు మనోజ్

Manchu Manoj And Bhuma Moun

Manchu Manoj And Bhuma Moun

హీరో మంచు మనోజ్ (Manchu Manoj) తండ్రి అయ్యారు. ఆయన భార్య భూమా మౌనిక(Bhuma Mounika Blessed with Baby Girl) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా మంచు లక్ష్మి వెల్లడించారు. ‘మనోజ్, మౌనిక ఆడబిడ్డకు జన్మనివ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. తన అన్న ధైరవ్ ఆనందానికి అవధుల్లేవు. చిన్నారిని మేము ప్రేమగా ‘MM పులి’ అని పిలుస్తాం. ఆ కుటుంబానికి శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని మంచు లక్ష్మి తెలిపారు. మనోజ్‌కు పాప పుట్టడంతో మంచు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

అంతకు ముందు మనోజ్..తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి 2015లో వివాహం చేసుకున్నాడు. కానీ కొద్దీ రోజులకే వీరు కోర్ట్ ద్వారా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు. గతంలో మౌనికకు వివాహం కాగా, ధైరవ్ జన్మించాడు. ప్రస్తుతం మనోజ్ సినిమాలు చేయడం తగ్గించేసాడు. ఈటీవీ లో ఉస్తార్ ర్యాంప్ ఆడిద్దాం అనే ఓ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు.

Read Also : YCP : పి.గన్నవరం లో వైసీపీకి భారీ షాక్..