మెగాస్టార్ చిరంజీవి , తమన్నా జంటగా కీర్తి సురేష్ , సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ భోళా శంకర్ (Bholaa Shankar ). బిల్లా ఫేమ్ మెహర్ రమేష్ డైరెక్షన్లో AK ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై రూపుదిద్దుకున్న ఈ మూవీ ఈ నెల 11 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటీకే సినిమాలోని సాంగ్స్, ట్రైలర్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేస్తూ వచ్చాయి. ఈ తరుణంలో మేకర్స్ బుధువారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా కు యూ/ఏ (Bhola Shankar censor certificate) సర్టిఫికెట్ జారీ చేసారు.
సినిమా చాల బాగా వచ్చిందని , యాక్షన్ , సెంటిమెంట్ తో పాటు కామెడీ ఓ రేంజ్ లో వర్క్ అవుట్ అయ్యిందని సెన్సార్ సభ్యులు చెప్పుకొచ్చారు. చిరంజీవి మరోసారి తన టైమింగ్ తో థియేటర్స్ లలో నవ్వులు పోయించడం ఖాయం అంటున్నారు. మెహర్ సినిమా ను చాల స్టైలిష్ గా తెరకెక్కించారని , సాంగ్స్ లొకేషన్స్ బాగున్నాయని చెపుతున్నారు. ఓవరాల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను భోళా శంకర్ అలరిస్తుందని అంటున్నారు.
చిరంజీవి నటించిన గత చిత్రం వాల్తేర్ వీరయ్య పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. భోళా శంకర్ (Bholaa Shankar ) విషయంలో కూడా అదే జరుగుతుంది. మొన్నటి వరకు సినిమా ఫై పెద్దగా అంచనాలు లేనప్పటికీ , రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ తో సినిమా ఫై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. మరి రేపు థియేటర్స్ లలో సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
Read Also : Alanna Panday: బికినీలో సెగలు రేపుతున్న అలన్నా పాండే, ఫొటోలు వైరల్