Site icon HashtagU Telugu

Jack Movie : సిద్దు తో గొడవ పై భాస్కర్ క్లారిటీ

Siddu Jonnala

Siddu Jonnala

‘జాక్’ సినిమా (Jack Movie) విడుదల తేదీ సమీపిస్తున్న వేళ, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. హీరో సిద్దు జొన్నలగడ్డ, దర్శకుడు భాస్కర్ (Siddu Jonnalagadda -Director Bhaskar) మధ్య గొడవ జరిగిందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఓ పాటను భాస్కర్ లేకుండానే షూట్ చేశారన్న ప్రచారం జరిగింది. షూటింగ్ సమయంలో సిద్దు క్రియేటివ్‌గా ఎక్కువగా పాల్గొనడంతో దర్శకుడికి అది ఇష్టంగా లేకపోయిందని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలపై స్పందిస్తూ తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఇద్దరూ స్పష్టత ఇచ్చారు.

SRH vs KKR: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఏమైంది.. 300 పరుగులు వద్దులే అంటూ ట్రోల్స్!

దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ.. సినిమా అనేది టీమ్ వర్క్ అని, డిస్కషన్ రూమ్‌లో వాదనలు సహజమని చెప్పారు. ఒక రూమ్‌లో వాదించుకుంటే, బయటకి వచ్చిన తర్వాత మిత్రులానే ఉంటామన్నారు. సిద్దుకు సినిమా పై మంచి అవగాహన ఉందని, ఆయన నటనపై నమ్మకం ఉన్నందువల్లే కొన్ని సీన్లు పూర్తిగా అతనికే అప్పగించగలమన్నారు. సిద్దు వర్క్ పై పూర్తి నమ్మకముందని చెప్పారు.

అదే సమయంలో సిద్దు కూడా తన అభిప్రాయం వెల్లడించారు. గండిపేటలో ఓ పాటను భాస్కర్ లేకుండానే షూట్ చేశామన్నది నిజమే కానీ, ఆయనకు అప్పటికి ఎడిటింగ్ పనులు ఉండటంతో, ముందుగానే అనుమతి తీసుకున్నామని తెలిపారు. “మీరు ఏసీలో ఎడిట్ చేసుకోండి, మేము ఎండలో పాట షూట్ చేస్తాం” అనే జోక్ కూడా ఇద్దరం చెప్పుకున్నామన్నారు. ట్రైలర్ లాంచ్‌లో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కనపడింది. దీంతో వారి మధ్య నిజంగా గొడవలేమన్న స్పష్టత వచ్చింది. ‘జాక్’ సినిమాపై ఉన్న వివాదాలు ఈ వ్యాఖ్యలతో ముగిసినట్టే.