Site icon HashtagU Telugu

Ghantasala – Bhanumathi : ఘంటసాల పై ప్రతీకారం తీర్చుకున్న భానుమతి..

Ghantasala Bhanumathi Issue From Malleswari Movie to Chakrapani Movie

Ghantasala Bhanumathi Issue From Malleswari Movie to Chakrapani Movie

టాలీవుడ్ కథానాయకుల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా భానుమతి(Bhanumathi) గురించే చెప్పాలి. నటిగా, దర్శకురాలిగా, రచయితగా, నిర్మాతగా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా.. ఇలా సినిమా రంగంలోని ప్రతి విషయంలో భానుమతి తనదైన ముద్ర వేశారు. భానుమతి అనగానే చాలామందికి ఆవిడ ముక్కు మీద కోపం గుర్తుకు వస్తుంది. ఎవరైనా ఒక మాట అంటే ఆమె తీసుకునేవారు కాదని, ఆ మాటకి బదులు ఎన్నాళ్ళయినా తిరిగి మళ్లీ ఇచ్చేవారని చెబుతుంటారు. ఇలా ‘మల్లీశ్వరి’ సినిమా సమయంలో ఘంటసాల(Ghantasala) అన్న మాటలకి ‘చక్రపాణి’ సినిమా సమయంలో ప్రతీకారం తీర్చుకున్నారట భానుమతి.

మల్లీశ్వరి సినిమాకి ఘంటసాల సంగీతం అందించగా భానుమతి కూడా అందులో పాటలు పాడారు. సాంగ్స్ రికార్డింగ్ అంతా అయిపోయిన తరువాత దర్శకుడు బిఎన్ రెడ్డి పాటలు వింటూ భానుమతితో ఒక మాట అన్నారట. “ఘంటసాల సన్నివేశానికి తగ్గట్టు చాలా ఎమోషనల్ గా పాడారు నువ్వు అంత బాగా పాడలేదు” అని అన్నారట. దానికి భానుమతి బదిలిస్తూ.. “ఆయన చుట్ట తాగడం వల్ల గొంతు సాఫ్ట్ గా అయ్యింది అందుకే ఆ ఎమోషన్ వచ్చింది” అని ఎత్తి పొడిచారట. అప్పట్లో ఘంటసాల పాటల రికార్డింగ్ ముందు గొంతు పదునెక్కాలని చుట్ట తాగేవారట. ఈ విషయాన్ని చూపిస్తూనే భానుమతి.. అది ఘంటసాల గొప్పతనం కాదని చుట్ట గొప్పతనం అనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈ వ్యాఖ్యలు విన్న ఘంటసాల.. “నా దగ్గర ఇంకో చుట్ట ఎక్స్‌ట్రా ఉంది అడిగితే నీకు ఇచ్చేవాడిని కదా” అని నవ్వుతూ భానుమతికి బదులిచ్చారట. ఘంటసాల సమాధానంతో భానుమతి బాధపడ్డారు. ఆయన మాటలకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే తాను మ్యూజిక్ డైరెక్షన్ చేసిన చక్రపాణి సినిమాలో ఘంటసాలతో ‘ఓ ప్రియురాలా ఓ జవరాల’ అనే పాటని పాడించారు. ఆ సాంగ్ ప్రాక్టీస్ కి ఘంటసాల ను పిలిపించి.. మీరు సరిగ్గా పాడటం లేదు అని చెప్పి చాలాసార్లు పాడించారట భానుమతి. అంతేకాదు ఘంటసాలతో ఇలా అన్నారట.. ‘ఇది విజయ సంస్థ కాదు భరణి సంస్థ. మీరు ఏది పాడితే అది మెచ్చుకోవడానికి’ అని ఎత్తు పొడిచారట. దాంతో మనసు నచ్చుకున్న ఘంటసాల అక్కడ నుంచి మౌనంగా వెళ్లిపోయారట.

 

Also Read : Chiranjeevi : వెంకీ మామ చిరుకి ఫోన్ చేసి.. ఆ మూవీ నేను చేస్తే బాగుండేదని అన్నారట.. ఏ సినిమా?