బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘భైరవం’ (Bhairavam ) మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకువచ్చింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఈ ముగ్గురి ఆశలన్నీ ఈ మూవీ పైనే పెట్టుకున్నారు. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. తమిళ హిట్ ‘గరుడన్’కు ఇది రీమేక్. ట్రైలర్, ఫస్ట్‌లుక్ పోస్టర్లతో మంచి బజ్ క్రియేట్ చేయగా, ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. మరి వారి అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? లేదా అనేది చూద్దాం.
Nothing Phone 2 : అమెజాన్ లో భారీగా తగ్గిన నథింగ్ ఫోన్ 2 ధర..కొనేవారికి ఇదే మంచి ఛాన్స్
మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురూ తమ తమ పాత్రల్లో అద్భుతమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ రఫ్ లుక్‌లో, మనోజ్ మాస్ యాక్షన్ స్టైల్లో, రోహిత్ ఆగ్రహంగా కనిపించి ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీమ్ పనితీరు మెచ్చుకోవాల్సిందే. కానీ కథ పాత ఫార్మాట్‌లో సాగడంతో, ఫస్టాఫ్ రొటీన్‌గా అనిపించిందని నెటిజన్లు చెబుతున్నారు. సెకండాఫ్‌లో మాత్రం ఎమోషన్, యాక్షన్ బాగా మిళితమై కొంత ఎంగేజింగ్‌గా ఉందని అంటున్నారు.
‘భైరవం’ ఓ మాస్ రస్టిక్ యాక్షన్ డ్రామా. సినిమా మొత్తం ఊహించదగిన కథనంతో సాగినప్పటికీ, మాస్ బీసీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశముంది. కొంతమంది నెటిజన్లు అనవసర సాంగ్స్, లవ్ ట్రాక్స్ కథ వేగాన్ని తగ్గించాయని, మరోవైపు ఇంటర్వెల్ బ్లాక్, హీరోల మధ్య డైనమిక్ ట్రాక్ సినిమాకు బలమైన పాయింట్లు అయ్యాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే, భారీ అంచనాలు లేకుండా వెళ్లినవారికి భైరవం ఓసారి చూడదగిన కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెపుతున్నారు.