Bhagya Sri Borse కొత్తొక వింత పాతొక రోత అంటారు. ఐతే పాత రోత కాకపోయినా హీరోయిన్స్ విషయంలో బోర్ అనేలా ఫీల్ అవుతుంటారు. అందుకే తెర మీద కొత్త కొత్త అందాలను చూపించాలని దర్శక నిర్మాతలు ఆరాటపడుతుంటారు. ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాల్లో హీరోలు ఎంతమంది వచ్చినా హీరోయిన్స్ విషయంలో మాత్రం లెక్క కడుతుంటారు. వారిలో ప్రేక్షకుల మన్నలను పొందే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఐతే కొత్త అందం ఏదైనా కనిపిస్తే చాలు ఆమెపై ప్రేమ కురిపిస్తారు.
ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజ (Raviteja) హీరోగా వస్తున్న మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న భాగ్య శ్రీ తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ నెల 15న రిలీజ్ కాబోతున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి వస్తున్న ప్రచార చిత్రాలన్నీ సినిమాపై బజ్ పెంచాయి.
Also Read : CM Revanth : టీచర్లను తేనెటీగలుతో పోల్చిన సీఎం
ఈ సినిమాతో భాగ్య శ్రీ ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సాంగ్స్ లో అమ్మడు ఏమాత్రం మొహమాటం లేకుండా గ్లామర్ షో చేసింది. రిలీజ్ అయిన సాంగ్స్ ప్రోమోస్ లోనే ఈ రేంజ్ లో ఉందంటే తప్పకుండా సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని చెప్పొచ్చు. భాగ్య శ్రీ బోర్స్ మిస్టర్ బచ్చన్ తో సూపర్ ఎంట్రీ ఇస్తుంది. అలానే సక్సెస్ కూడా అందుకుంది అంటే ఒక రేంజ్ పాపులారిటీ దక్కినట్టే.
ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబో సినిమాలో ఛాన్స్ పట్టేసింది అమ్మడి. విడి 12వ సినిమాగా ఆ ప్రాజెక్ట్ కూడా భారీ హైప్ తో వస్తుంది.