Site icon HashtagU Telugu

Bhagavanth Kesari : రేపటి నుండి భగవంత్ కేసరి స్ట‍్రీమింగ్ ..

Balakrishna NBK 108 Movie Title announced as Bhagavanth Kesari

Balakrishna NBK 108 Movie Title announced as Bhagavanth Kesari

సినీ లవర్స్ (Cine Lovers) ప్రస్తుతం ఓటిటి (OTT) చానెల్స్ కు బాగా అలవాటుపడ్డారు. కరోనా (Corona) సమయంలో థియేటర్స్ మూతపడడంతో ఓటిటి కి అలవాటుపడ్డ జనాలు..ఇప్పుడు థియేటర్స్ కు వెళ్లడమే మానేశారు. అగ్ర హీరోల సినిమాలు వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. సినిమా విడుదలై నెల రోజులు గడవకముందే ఓటిటి ల్లో స్ట‍్రీమింగ్ అవుతుండడం తో ఏంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీ తో సినిమా చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. దీంతో అగ్ర హీరోల సినిమాలు సైతం స్ట‍్రీమింగ్ లో సందడి చేస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా బాలకృష్ణ (Balakrishna) బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి (Bhagavanth Kesari) స్ట‍్రీమింగ్ (Streaming) కు సిద్ధమైంది. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రత్యేకపాత్రలో మెరిసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 19న థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నమోదు చేసుకుంది. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ రేపటినుండి ( నవంబర్‌ 24 ) స్ట‍్రీమింగ్ చేస్తుంది. అయితే మొదట ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై చాలా సార్లు రూమర్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం అఫీషియల్‌గా ఓటీటీ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. దీంతో ఈ శుక్రవారమే భగవంత్ కేసరి కుటుంబంతో కలిసి చుసేయొచ్చని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Read Also : Game Changer : గేమ్ ఛేంజర్ నుండి మరో వీడియో లీక్..