BiggBoss 8 Telugu బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైంది. మొదటి వారం ఆరుగురు కంటెస్టెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా వారిలోంచి బేబక్క హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. లీస్ట్ ఓటింగ్ లో మణికంఠ, బేబక్క ఇద్దరు ఉండగా వారిలో నుంచి బేబక్క (Bebakka)కు బై బై చెప్పేశారు. ఇక స్టేజ్ మీద అందరికీ సెండాఫ్ ఇస్తూ నాగార్జున ఇచ్చిన టాస్క్ ప్రకారం ఎవరు బిగ్ బాస్ లో ఉండటానికి అనర్హులో చెప్పమనగా బేబక్క మొన్నటిదాకా కలిసి ఉన్న నిఖిల్ (Nikhil) తో పాటుగా పృధ్విరాజ్, సోనియా, మణికంఠ పేర్లను పెట్టింది.
వీళ్లంతా కూడా హౌస్ లో ఉండటానికి అర్హత లేదని చెప్పుకొచ్చింది. బేబక్క వెళ్తున్నందుకు కిరాక్ సీత చాలా ఎమోషనల్ అయ్యింది. ఇక ఇదిలాఉంటే నేడు జరగబోయే నామినేషన్స్ కూడా హాట్ హాట్ గా ఉండబోతాయని తెలుస్తుంది. ఆల్రెడీ రిలీజైన ప్రోమో చూస్తే ముగ్గురు క్లాన్ ల నుంచి ఎవరు హౌస్ లో ఉండేందుకు అర్హత లేదని అనుకుంటారో వారిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.
సీజన్ 8 మొదలైన వారం రోజుల్లోనే..
ఈ వారం నామినేషన్స్ లో కూడా హౌస్ లో ఆరుగురు నుంచి ఏడుగురు దాకా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 మొదలైన వారం రోజుల్లోనే హౌస్ మెట్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. హోస్ట్ గా నాగార్జున (Nikhil) కూడా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతూ షోని మరింత హైలెట్ చేస్తున్నారు.
ఇక బేబక్క బయటకు వెళ్లి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో నిఖిల్, సోనియా తేనె పూసిన కత్తులు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. నిఖిల్ సోనియా వెంట పడుతున్నాడని చెప్పి షాక్ ఇచ్చింది బేబక్క.