ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (AP Deputy CM ) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినీ పరిశ్రమ(Tollywood)పై చేసిన విమర్శలపై ఇండస్ట్రీలో భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. పవన్ విడుదల చేసిన లేఖలోని పదులు కొందరిని బాధించగా, మరికొందరు ఆయన అభిప్రాయాలను గౌరవిస్తున్నారు. ఇప్పటికే నిర్మాతలు బన్నీ వాసు, నాగ వంశీ లాంటి వారు ఇండస్ట్రీలో ఐక్యత లోపించిందని, చిత్రసీమ ఏమి చేస్తున్నదో అర్థం కావడం లేదని స్పందించిన నేపథ్యంలో, తాజాగా నిర్మాత బండ్ల గణేష్ కూడా తనదైన శైలిలో మద్దతు తెలిపారు.
AMRUT Scheme : ఏపీలో అమృత్ పథకానికి రూ.397 కోట్లు కేటాయిస్తు ఉత్తర్వులు జారీ
పవన్ కళ్యాణ్‌కు గట్టి అభిమాని అయిన బండ్ల గణేష్ (Bandla Ganesh), పరిశ్రమ పెద్దల వైఖరిపై తీవ్రంగా స్పందించారు. ఆయన “సింహాన్ని కెలకొద్దు!” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నాయి. “సింహాన్ని దూరంగా ఉండి చూడండి, దగ్గరకెళ్లి కెలికారా మీ ఇష్టం” అంటూ పవన్ ఫోటోతో పోస్ట్ చేశారు. పవన్ రాసిన లేఖతో పాటు, ఆయన సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదలకు ముందు థియేటర్ల బంద్ ప్రకటించిన పరిస్థితుల నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బండ్ల గణేష్ వ్యాఖ్యలు, సినీ ఇండస్ట్రీని పవన్‌తో సర్దుకుపోవాలన్న సూచనగా నిలిచాయి. పవన్‌ను కెలికితే ఊరుకోడు, ఆయన్ను ఎదుర్కొనడం కన్నా అర్థవంతంగా కలిసి పనిచేయడమే మంచిదన్న సూత్రాన్ని గణేష్ వెలిబుచ్చారు. గతంలోనూ అనేకసార్లు పవన్‌కు మద్దతుగా నిలిచిన గణేష్, ఈసారి పరిశ్రమ పెద్దలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలతో మరింత చర్చకు దారితీశారు. ఇక అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాతలు ఇప్పటికీ స్పందించకపోవడం గమనార్హం.