Bandla Ganesh: గురూజీని కలవండి, భారీ గిఫ్ట్ ను అందుకోండి, త్రివిక్రమ్ పై బండ్ల గణేశ్ పంచులు

బండ్ల గణేశ్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ పై రెచ్చిపోయాడు. సోషల్ మీడియాలో బండ్ల ట్వీట్ వైరల్ గా మారింది.

  • Written By:
  • Updated On - May 26, 2023 / 02:11 PM IST

టాలీవుడ్ సంచలనం బండ్ల గణేశ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ను టార్గెట్ చేశాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్దిరోజులుగా బండ్ల గణేశ్ త్రివిక్రమ్ పై సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సెటైర్లు వేస్తున్నాడు. బండ్ల గణేశ్ రెచ్చిపోవడానికి చాలా కారాణాలే ఉన్నాయి. గతంలో బండ్ల, పవన్ మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఎప్పుడైతే త్రివిక్రమ్ పవన్ సినిమాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుండటం బండ్ల గణేశ్ కు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఓ దశలో బండ్లకు పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి.

అంతేకాదు.. పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకుని త్రివిక్రమ్ సంపాదించుకుంటున్నారనే విమర్శలు కూడా వున్నాయి. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగానే ఉన్నారు. బ్రో సినిమా నిర్మాతల నుంచి త్రివిక్రమ్ భారీ రెమ్యూనిరేషన్ ప్లస్ లాభాల్లో వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే ఓజి నిర్మాత నుంచి కూడా రెమ్యూనిరేషన్, లాభాల్లో వాటా వుందని టాక్ వుంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్ చేశాడు. ఎవరో బండ్ల గణేష్ ను ట్విట్టర్లో నిర్మాత కావాలని వుంది అని అడిగారు దానికి బండ్ల ఇచ్చిన సమాధానం…’గురూజీని కలవడం..భారీ గిఫ్ట్ పట్టండి’ అంటూ రియాక్ట్ అయ్యాడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో గురూజీ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది త్రివిక్రమ్ మాత్రమే. బండ్ల గణేశ్ ట్వీట్ త్రివిక్రమ్ ను ఉద్దేశించి చేశాడనేది స్పష్టంగా అర్ధమవుతోంది.

వకీల్ సాబ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్పీచ్‌ కంటే.. బండ్ల గణేష్‌ స్పీచ్‌కే అంతా ఫిదా అయ్యారు. అలా భీమ్లా నాయక్ ఈవెంట్లో ఏదైనా జరుగుతుందని బండ్ల గణేష్‌ను పిలవొద్దని దూరంగా ఉంచాడట త్రివిక్రమ్. ఈ విషయాన్ని బండ్ల గణేష్‌ స్వయంగా తెలుపగా.. ఆ ఆడియో లీకైంది. మొదట్లో ఆ వాయిస్ తనది కాదని బుకాయించాడు. మళ్లీ చివరకు ఆ వాయిస్ నాదే.. నేనే త్రివిక్రమ్‌ని తిట్టాను అని ఒప్పుకున్నాడు. అలా బండ్ల గణేష్‌ త్రివిక్రమ్ మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రెమ్యూనరేషన్ విషయంలో చేసిన కామెంట్లు బండ్ల గణేష్‌కు డ్యామేజ్‌ను ఏర్పర్చింది. దీంతో బండ్ల గణేష్‌ హర్ట్ అయ్యాడని కామెంట్లు వచ్చాయి. కానీ తాను తన దేవుడి మీద ఎందుకు కోప్పడతాను అని, తన దేవుడు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్‌.

Also Read: Samantha: షూటింగ్స్ కు విరామం.. తల్లితో కలిసి సమంత డిన్నర్ డేట్