Bandla Ganesh : హాస్పటల్ లో చేరిన బండ్ల గణేష్..ఆరోగ్యం ఫై ఫ్యాన్స్ ఆరా..!!

ఉదయం నుంచి ఆయనకు శ్వాస సంబంధిత, ఇతర సమస్యలు తలెత్తడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు

Published By: HashtagU Telugu Desk
Bandla Ganesh Hsp

Bandla Ganesh Hsp

సినీ నటుడు , నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) హాస్పటల్ చేరిన విషయం అభిమానుల్లో , చిత్రసీమలో టెన్షన్ పెడుతుంది. ఉదయం నుంచి ఆయనకు శ్వాస సంబంధిత, ఇతర సమస్యలు తలెత్తడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారు.

బండ్ల గణేష్ ఈయన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ కెరియర్ మొదలుపెట్టిన ఆయన…ఆ తర్వాత నిర్మాతగా మారారు. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం సినిమాలు నిర్మించడం తగ్గించినప్పటికీ , రాజకీయంగా ఆయన పేరు మీడియా లో హైలైట్ అవుతూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఫై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటూ వచ్చిన ఆయన..సరిగ్గా రేపు ఏపీలో ఫలితాలు , ఇటు తెలంగాణ లోక్ సభ ఫలితాలు వెల్లడి అవుతున్న క్రమంలో అస్వస్థతకు గురి కావడం అభిమానుల్లో ఆందోళనకు గురి చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఉదయం నుంచి ఆయనకు శ్వాస సంబంధిత, ఇతర సమస్యలు తలెత్తడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం హాస్పటల్ లో చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్‌లో ఆయన చేరిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో ఆయన తన ఛాతీని నొక్కుకుంటూ కనిపించగా.. వైద్యులు ఆయన చికిత్స కొనసాగిస్తూ కనిపించారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాం. కొంత ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. రేపటిలోగా ఆయనను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్పినట్లు సమాచారం.

Read Also : AP Election Results : వైసీపీకి 123 స్థానాలు వస్తాయి – పరిపూర్ణానంద

  Last Updated: 03 Jun 2024, 08:59 PM IST