Site icon HashtagU Telugu

Razakar : రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

Bandisanjay Revanth

Bandisanjay Revanth

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు. ‘రజాకార్’ (Razakar ) సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇచ్చి, ప్రోత్సహించాలని కోరారు. 1947 ఆగస్టు 15న ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పటికీ.. హైదరాబాద్ కి మాత్రం నైజాం సంస్థానం నుండి స్వాతంత్రం వెంటనే రాలేదు. ఆ టైంలో చోటు చేసుకున్న ఘోరాల ఆధారంగా ‘రాజాకార్’ చిత్రాన్ని రూపొందించారు . 200 ఏళ్ల చరిత్ర కలిగిన నైజాం సంస్థను రజాకర్ వ్యవస్థ ఏ విధంగా నాశనం చేసింది అనేది ఈ సినిమా కథ.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల 15వ తేదీన‌ విడుద‌లైన ‘రజాకార్’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు యాటా సత్యనారాయణ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు. గూడూరు నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో బాబీసింహా, అనసూయ, రాజ్ అర్జున్, మార్కండ్ దేశ్‌పాండే, ఇంద్రజ, తేజ్ సప్రు, ప్రేమ‌, తలైవాస్ విజయ్ కీల‌క‌ పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఇంతటి దారుణాలు జరిగాయా? అని తమ చరిత్రను తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకుని చలించిపోతున్నారు. అలాంటి గొప్ప చిత్రానికి వినోదపు పన్ను రాయితీ ఇచ్చి, ప్రోత్సహించాలని బండి సంజయ్ సీఎం రేవంత్ ను లేఖ ద్వారా కోరారు. విద్యార్థుల కోసం రజాకార్ సినిమా ప్రత్యేక షోలు వేయించాలని ఆయన అన్నారు. కాగా, ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్‌లో చిత్రబృందంతో కలిసి బండి సంజయ్ రజాకార్ సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఈ సినిమా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు అందరూ ఈ చిత్రాన్ని చూసి ఒవైసీ పార్టీ ఎలాంటిదో తెలుసుకోవాలని హితవు పలికారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే తమ అభిమతం అని ప్రకటించారు. ఎంత ఖర్చైనా ధైర్యంగా చిత్రాన్ని నిర్మించిన గూడూరు నారాయణ రెడ్డికి బండి సంజయ్ అభినందించారు.

Read Also : Nandikotkur MLA Arthur Thoguru : వైసీపీ కి భారీ షాక్..కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే