Site icon HashtagU Telugu

Senior Actress : తాగుడుకు బానిసైన బాలకృష్ణ హీరోయిన్

Urvashi Actress

Urvashi Actress

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు స్టార్ డమ్‌ సంపాదించుకొని, తమ ప్రత్యేకతను కొనసాగిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రమే ఈ స్థాయిని రిటైన్ చేసుకోగలుగుతారు. ఒకప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఊర్వశి (Urvashi ), తన కెరీర్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. తన బాల్యం నుంచే చిత్రసీమలోకి అడుగు పెట్టిన ఆమె, మలయాళంతో పాటు తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో సత్తా చాటింది. టాలీవుడ్‌లో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల కారణంగా మద్యానికి బానిసై సినీ పరిశ్రమలో తన స్థానాన్ని కోల్పోయింది.

Mastan Sai : మస్తాన్ సాయి హార్డ్‌డిస్క్‌లో 499 అశ్లీల వీడియోలు

ఊర్వశి కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసింది. 1984లో టాలీవుడ్‌లోకి చిరంజీవితో ‘రుస్తుం’, 1985లో బాలకృష్ణతో ‘భలే తమ్ముడు’ సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తన నటనలో ఉన్న సహజత్వం, హాస్యంతోపాటు భావోద్వేగాలను అద్భుతంగా పలికించగల సామర్థ్యం ఆమెను పరిశ్రమలో ప్రత్యేకంగా నిలబెట్టింది. 2006లో ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. అయితే వ్యక్తిగత జీవితంలో వివాహ వైఫల్యం, ఒత్తిడులు, మద్యపానం కారణంగా ఆమె సినీ జీవితంపై ప్రభావం పడి, కెరీర్ పతనానికి కారణమైంది.

YSRCP: వైసీపీకి మరో షాక్‌.. మరో నేత అరెస్ట్‌

2007లో నటుడు మనోజ్ కె విజయన్‌ను వివాహం చేసుకున్న ఊర్వశి, కొన్నేళ్లకే అతనికి విడాకులు ఇచ్చింది. తర్వాత 2016లో వ్యాపారవేత్త శివప్రసాద్‌ను రెండో వివాహం చేసుకుంది. ఆమె ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా ఉంటూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలు చేస్తోంది. ఊర్వశి కెరీర్ పతనం గురించి పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, తన సత్తా నిరూపించుకుంటూ మరోసారి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.