Site icon HashtagU Telugu

Balakrishna : త‌మ‌న్‌కు బాలయ్య గిఫ్ట్‌… ఏంటో తెలుసా..?

Thaman, Balakrishna

Thaman, Balakrishna

Balakrishna : టాలీవుడ్‌లో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ , సంగీత దర్శకుడు ఎస్ఎస్ త‌మ‌న్‌ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద అత్యంత విజయవంతంగా నిలిచాయి. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ సినిమాకు త‌మన్ ఇచ్చే సంగీతం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ సక్సెస్‌ఫుల్ గా కొనసాగుతూనే ఉంది. సినిమా ప్రపంచంలోనే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బాలకృష్ణ , త‌మన్‌ మధ్య మంచి అనుబంధం నెలకొంది.

JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీలత మరో ఫిర్యాదు.. ఆరోపణలివీ
ఇటీవల, త‌మన్‌ తన కెరీర్‌లో పలు హిట్లను అందుకున్నందుకు, బాలకృష్ణ అతనికి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం విశేషం. బాలకృష్ణ, త‌మన్‌కి ఖరీదైన పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు బహుమతిని ఇవ్వడమే కాకుండా, త‌మన్‌కు తన కెరీర్‌లో మరెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. త‌మన్‌కి ఇచ్చిన ఈ విలువైన బహుమతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rent A Boyfriend : బిర్యానీ రేటుకే అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. పోస్టర్లు వైరల్.. నెటిజన్ల ఆగ్రహం

ఈ విషయాన్ని బాలకృష్ణ హైద‌రాబాద్‌లోని బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో జరిగిన ఆంకాల‌జీ యూనిట్ ప్రారంభోత్సవంలో ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ, “త‌మన్ నాకు త‌మ్ముడి లాంటి వారే. ఈయన వ‌రుస‌గా నాలుగు పెద్ద హిట్లను ఇచ్చాడు. అలాంటివాడికి ప్రేమతో నేను ఈ కారు బహుమతిగా ఇచ్చాను. మా ప్ర‌యాణం ఇలాగే సాఫీగా కొన‌సాగుతుంది” అని అన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కూడా త‌మన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే, ‘అఖండ 2’ సినిమా థియేటర్లలో భారీ సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో హిట్ అవుతుందని త‌మన్‌ సూచించిన విషయం తెలిసిందే.