Balakrishna : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు, నెటిజన్లు.. బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు సెలబ్రిటీలు బాలయ్య ఇంటికి వెళ్లి మరీ అభినందనలు తెలియచేస్తున్నారు.
ఈ క్రమంలో నిన్న సాయంత్రం కిషన్ రెడ్డి(Kishan Reddy) బాలకృష్ణ ఇంటికి వెళ్లి పద్మ భూషణ్ అవార్డు వచ్చినందుకు అభినందలు తెలియచేసారు. అనంతరం కిషన్ రెడ్డి, బాలయ్య ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ.. నాన్న గారికి కూడా భారతరత్న ఇస్తే బాగుంటుంది. ఆ అవార్డు కూడా వస్తుందని ఆశిస్తున్నాము. తెలుగు ప్రజలు, అభిమానుల కోరిక ఇది. ఆయన చేసిన సేవలు మరువరానివి అని అన్నారు.
అయితే దీనికి కిషన్ రెడ్డి నవ్వి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఎన్టీఆర్ కు ఆయన బతికున్నపుడే ఇంకా రాజకీయాల్లోకి రాకముందే సినిమా రంగానికి చేసిన సేవలకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ తెలుగు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీతో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరణాంతరం ఆయనకు భారతరత్న ఇవ్వాలని అనేక మార్లు ప్రతిపాదనలు చేసారు. ఇప్పటికి ఎన్టీఆర్ ఫ్యామిలీ, పలువురు ఫ్యాన్స్, తెలుగు దేశం కార్యకర్తలు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి భవిష్యత్తులో అయినా ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తారేమో చూడాలి.
Also Read : Hari Prriya : తల్లయిన హీరోయిన్ హరిప్రియ.. సింహం ఫ్యామిలీ ఫోటో షేర్ చేసి..