Balakrishna : యంగ్ హీరోకి ముద్దు పెట్టిన బాలకృష్ణ

Balakrishna Kiss : ఈ ఎపిసోడ్ ద్వారా ఆమెకు ప్రేక్షకులతో ఇంకొంత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రోమోలో మరో హైలైట్ ఏంటి అంటే.. బాలకృష్ణ నవీన్ పొలిశెట్టికి ముద్దు పెట్టడం

Published By: HashtagU Telugu Desk
Balakrishna Naveen

Balakrishna Naveen

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న అహా ఓటీటీ ‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable with NBK ) సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడంతో..ఈ సీజన్ అంతకు మించి ఉండబోతుందని అంత భావించారు. అంత భావించినట్లు ప్రతి వారం సరికొత్త సెలబ్రెటీ తో ఆకట్టుకుంటున్నారు. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌ కు బాలయ్య బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) హాజరై మంచి ఓపెనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్, లక్కీ భాస్కర్ టీం తదితరులు హాజరై సందడి చేసారు. ఇక ఈ వారం యంగ్ హీరో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ తో పాటు డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల (Naveen Polishetty – Sreeleela) సందడి చేసారు. దీనికి సంబదించిన ప్రోమో ను ఆహా రిలీజ్ చేసింది. ప్రోమో లో బాలకృష్ణ తనదైన శైలిలో నవీన్, శ్రీలీలతో మాట్లాడారు. నవీన్‌కి సరదా ప్రశ్నలు వేసి, ఆయన నుంచి గిలిగింతలు పెట్టించే సమాధానాలు రాబట్టారు. నవీన్ పొలిశెట్టి తన శైలిలో సమాదానాలు చెప్పి బాలకృష్ణ సహా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు. ‘జాతి రత్నాలు’ కథానాయకుడిగా ఇప్పటికే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నవీన్, ఈ షోలో కూడా తన ప్రత్యేకతను చూపించాడు.

ఇక హీరోయిన్ శ్రీలీల తన అమాయకత్వం, చురుకైన సమాధానాలతో ఆకట్టుకుంది. బాలకృష్ణ ఆమెతో పంచులు వేసి, హాస్యాన్ని మరింత పెంచారు. శ్రీలీల నవ్వులు, అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ద్వారా ఆమెకు ప్రేక్షకులతో ఇంకొంత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రోమోలో మరో హైలైట్ ఏంటి అంటే.. బాలకృష్ణ నవీన్ పొలిశెట్టికి ముద్దు పెట్టడం. ఈ సన్నివేశం ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. బాలకృష్ణకు నవీన్ సరదాగా ఇచ్చిన రియాక్షన్లు కూడా హైలైట్ అయ్యాయి. వీరిద్దరి మధ్య స్నేహభావం, సరదా సంభాషణలు ఈ ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 6న ఆహాలో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌పై ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో ప్రతి ఎపిసోడ్‌తో కొత్త తరహా వినోదాన్ని అందిస్తూ ప్రేక్షకుల అభిమానం పొందుతోంది. ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందని అంత భావిస్తున్నారు.

Read Also : Minister Sridhar Babu : ఉద్యోగావకాశాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఘనత – మంత్రి శ్రీధర్ బాబు

  Last Updated: 02 Dec 2024, 07:41 PM IST