Vijay Deverakonda – Balakrishna : విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పీరియాడిక్ స్పై యాక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. గత సినిమాలు ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై విజయ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది VD12.
VD12 సినిమా 2025 సమ్మర్ లో రిలీజ్ కానుంది. అయితే సంక్రాంతి తర్వాత ఈ సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం. తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ సినిమా టీజర్ కు బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. ఆల్రెడీ సితార్ ఎంటర్టైన్మెంట్స్ బాలయ్య ను అడగడం, ఆయన ఓకే చెప్పడం అయిపోయిందట.
బాలయ్య సితారలో NBK109 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక యువ హీరోలతో బాలయ్య చాలా క్లోజ్ గా ఉంటాడు, వాళ్ళతో పార్టీలు చేసుకుంటాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ సినిమా టీజర్ కు వాయిస్ ఓవర్ సహాయం అడగడంతో వెంటనే ఓకే చెప్పాడు బాలయ్య. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య వాయిస్ ఓవర్ లో విజయ్ దేవరకొండ సినిమా టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఇప్పట్నుంచే ఎదురుచూస్తున్నారు.
Also Read : Kiran Abbavaram KA : దీపావళి హిట్టు సినిమా కిరణ్ అబ్బవరం ‘క’.. మలయాళంలో రిలీజ్ ఎప్పుడంటే..