Site icon HashtagU Telugu

Balakrishna : హిందూపూర్‌ జిమ్‌లో బాలయ్య కసరత్తులు.. వీడియో వైరల్..

Balakrishna Doing Exercise at Gym in Hindupur Video goes Viral

Balakrishna Gym

Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఓ పక్క బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో హిట్స్ కొడుతూ మరో పక్క హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపూర్ లో సేవలు అందిస్తున్నాడు. తాజాగా బాలకృష్ణ జిమ్ లో కసరత్తులు చేసిన వీడియో వైరల్ గా మారింది. నేడు బాలకృష్ణ హిందూపూర్ లో అన్న క్యాంటిన్ ని ప్రారంభించడానికి వెళ్లారు.

బాలకృష్ణ హిందూపూర్ లో అన్న క్యాంటిన్ ప్రారంభించి తన చేత్తో పేదలకు స్వయంగా ఫుడ్ వడ్డించారు. అనంతరం పక్కనే ఓ కొత్త జిమ్ కూడా బాలయ్య చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. బాలకృష్ణ జిమ్ ప్రారంభించి అందులో కాసేవు కసరత్తులు చేశారు. దీంతో బాలకృష్ణ జిమ్ లో కసరత్తు చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి.

 

Also Read : HariHara Veeramallu : హరిహర వీరమల్లు అప్డేట్.. 500 మందితో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్..