Akhanda 2 : అఖండ 2 చాలా పెద్ద ప్లానింగే చేస్తున్నారు..!

Akhanda 2 నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 10:19 AM IST

Akhanda 2 నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న బాలయ్య బోయపాటి కాంబో డబుల్ హ్యాట్రిక్ కి నాంది పలికారు. త్వరలోనే అఖండ 2 సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగా డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతుందని టాక్. అఖండ 2 సినిమాలో 150 కోట్ల పైనా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

అఖండ 2 సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. అఖండ 2 సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ ప్లానింగ్ తో వస్తున్నారని తెలుస్తుంది. అఖండ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అఖండ 2ని అంతకుమించి అనిపించేలా చేయాలని చూస్తున్నారు.

అఖండ సినిమా సీక్వెల్ అనగానే నందమూరి ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం బాలకృష్ణ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కావడం ఆలస్యం అఖండ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అఖండ 2 లో డివోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని టాక్. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ప్రభంజనం సృష్టించేలా అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Also Read : Vignesh Shivan : బాహుబలి శివగామిని గుర్తు చేసిన తమిళ దర్శకుడు..!