నందమూరి బాలకృష్ణ సూపర్ హీరో కాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం ఎన్.బి.కె 109 సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ తర్వాత ఒక సూపర్ హీరో మూవీ చేస్తాడన్న టాక్ వినిపిస్తుంది. అంతేకాదు దానికి సంబందించిన ఒక లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ సూపర్ హీరో డ్రెస్ లో ఉన్న పిక్ ఒకటి బయటకు వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలయ్య సూపర్ హీరో డ్రెస్ లో అదిరిపోయేలా ఉన్నారు. ఐతే ఇది న్యాచురల్ గా కాకుండా యానిమేషన్ ఫోటోలా కొడుతుంది. ఐతే బాలకృష్ణ చేస్తున్న సూపర్ హీరో సినిమా ఎవరి డైరెక్షన్ లో వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం సూపర్ హీరో కథలను చేస్తున్న ప్రశాంత్ వర్మ తోనే బాలకృష్ణ సినిమా ఉంటుందని అంటున్నారు.
బాలయ్య తన సినిమాలో మామూలుగానే..
ఐతే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. సూపర్ హీరోగా బాలకృష్ణ చేయడం జరిగితే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. బాలయ్య తన సినిమాలో మామూలుగానే సూపర్ హీరో ఎలిమెంట్స్ చేస్తుంటాడు. సో కచ్చితంగా ఆయన సూపర్ హీరో సినిమాలు చేస్తే మాత్రం ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క.
ఎన్.బి.కె 109 తర్వాత బాలకృష్ణ అఖండ 2 సినిమా చేయనున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను 150 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిచే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈసారి అఖండ 2 పాన్ ఇండియా లెవెల్ లో భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Nobel Prize : కొరియా రచయిత్రికి నోబెల్ సాహిత్య బహుమతి