బలగం (Balagam) తో తన బలం ఏంటో చూపించిన నటుడు , డైరెక్టర్ వేణుఎల్దెండి (Venu)..ఇప్పుడు ఎల్లమ్మ (Yellamma ) అనే టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. గత కొద్దీ రోజులుగా సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ మధ్యనే ఈ కథ మొత్తం పూర్తి కావడం తో ఈ కథకు సెట్ అయ్యే హీరో కోసం ఎదురుచూస్తూ వచ్చారు. పలువురు హీరోలకు కథ వినిపించినప్పటికీ వారు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తాజాగా ఈ కథ విన్న హీరో నితిన్ (Nithin)..వేణుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రంగస్థల కళాకారుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికార ప్రకటన త్వరలో రానున్నదట.
వేణు విషయానికి వస్తే..జై మూవీ తో కమెడియన్ గా ఇండస్ట్రీ కి పరిచమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్నాడు. బుల్లితెర లో ప్రసారమై..జబరదస్త్ షో ద్వారా మరింత ఆకట్టుకున్నారు. ఇక 2023 లో బలగం మూవీ తో డైరెక్టర్ గా మారి..మొదటి సినిమాతోనే అందర్నీ కట్టిపడేసాడు. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో..ఎన్ని అవార్డ్స్ , కలెక్షన్లు రాబట్టిందో తెలియంది కాదు. కుటుంబ బంధం గురించి ఎంతో చక్కగా చూపించి..అందరి చేత కన్నీరు పెట్టించాడు వేణు. ఈ సినిమా తర్వాత వేణు నెక్స్ట్ సినిమా ఏంటి..? అది ఎలా ఉండబోతుందో..? అనే అంచనాలు పెరిగిపోయాయి. మారి ఎల్లమ్మ ఎలా ఉండబోతుందో చూడాలి.
Read Also : Dementia: మతిమరుపు పెరిగిపోతుంటే రోజూ వంట చేసి సమస్య నుంచి బయటపడండి