Divya Sathyaraj : బాహుబలిలో కట్టప్ప పాత్రతోనే కాక అనేక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు తమిళ నటుడు సత్యరాజ్. ఆయన ప్రస్తుతం సినిమాలతో బిజీగానే ఉన్నారు. తాజాగా ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సత్యరాజ్ కూతురు దివ్య ఒక న్యూట్రీషియన్. బయట న్యూట్రీషియన్ గా పనిచేస్తూనే చాలా మంది సెలబ్రిటీలకు కూడా పర్సనల్ న్యూట్రీషియన్ గా ఉంది. అప్పుడప్పుడు పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది దివ్య. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు, తన తండ్రి ఫొటోలతో పాటు న్యూట్రీషియన్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా దివ్య సత్యరాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దివ్య తమిళనాడు సీఎం స్టాలిన్ కి చెందిన DMK పార్టీలో నేడు చేరారు. సీఎం స్టాలిన్ ని అధికారికంగా కలిసి ఆయన సమక్షంలోనే నేడు ఆ పార్టీలో చేరారు దివ్య సత్యరాజ్. దీంతో ఈ వార్త తమిళనాట చర్చగా మారింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది.
దివ్య సత్యరాజ్ తన సోషల్ మీడియాలో.. ఈ రోజు ఓ కొత్త చాప్టర్ నా జీవితంలో మొదలు అయింది. నేను DMK పార్టీలో చేరాను. నన్ను పార్టీలో చేర్చుకున్నందుకు సీఎం స్టాలిన్ గారికి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారికి ధన్యవాదాలు. మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు నేర్పిన విలువలు, సమాజం గురించి చెప్పిన మాటలు.. అవన్నీ నేడు నేను ప్రజాసేవకు ముందుకు రావడానికి ఉపయోగపడ్డాయి. ఒక తమిళ ఆడపడుచుగా తమిళనాడు ప్రజలకు సేవ చేస్తాను అంటూ తెలిపింది. దీంతో పలువురు ఆమెకు కంగ్రాట్స్ చెప్తుండగా వేరే పార్టీల అభిమానులు విమర్శలు చేస్తున్నారు.
Also Read : Medak Collector Rahul Raj: మరోసారి టీచర్‌గా మారిన కలెక్టర్.. వీడియో వైరల్