పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో బద్రి సినిమా చేసిన బాలీవుడ్ అందాల భామ అమీషా పటేల్ (Ameesha Patel) ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో తెలుగులో ఆ తర్వాత మహేష్ తో నాని, ఎన్ టీ ఆర్ తో నరసిం హుడు సినిమాలు చేసింది. బాలీవుడ్ లో అమ్మడు కొన్నాళ్ల పాటు తన పాపులారిటీ కొనసాగించింది. ఐతే 49 ఏళ్లైనా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉంది అమీషా పటేల్.
ఐతే అమ్మడికి పెళ్లి కాలేదనే కానీ చాలా ప్రేమకథలు ఉన్నాయి. అప్పట్లో ముగ్గురు హీరోలతో అమీషా నడిపిన లవ్ స్టోరీ తెలిసినవే. ఒక స్టార్ డైరెక్టర్ తో కూడా అమ్మడు డేటింగ్ చేసింది. ఇదిలాఉంటే కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న అమీషా పటేల్ తన క్రేజీ ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరించింది. ఐతే లేటెస్ట్ గా తన బోయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ సర్ ప్రైజ్ చేసింది అమ్మడు.
30 ఏళ్ల బిజినెస్ మ్యాన్ తో అమీషా..
అమ్మడి ఏజ్ 49 కాగా 30 ఏళ్ల బిజినెస్ మ్యాన్ తో అమీషా పటేల్ డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అమీషా పటేల్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ లేటెస్ట్ గా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతని తో ఫోటోలు దిగిన మీనాక్షి నా డార్లింగ్ నిర్వాన్ బిర్లా (Nirvan Birla)తో లవ్లీ ఈవెనింగ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
బిజినెస్ ఫ్యామిలీలో పుట్టిన నిర్వాన్ బిర్లా అమీషా కన్నా 20 ఏళ్లు చిన్న వాడు. అయినా సరే ప్రేమకు ఏజ్ గ్యాప్ అడ్డు కాదు అన్నట్టుగా అతనితో కలిసి డేటింగ్ చేస్తుంది అమీషా పటేల్. అమీషా ఈమధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా ఆమె సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
గదర్ 2 తో సక్సెస్ అందుకున్న అమీషా పటేల్ తన బోయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఐతే ఇది పెళ్లి దాకా వెళ్లే బంధమా లేక జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంటేనా అన్నది తర్వాత తెలుస్తుంది.
Also Read : Meenakshi Chaudhary : అక్కినేని హీరోతో మీనాక్షి పెళ్లి.. హీరోయిన్ స్పందన ఇది..!