Site icon HashtagU Telugu

Bachhala Malli – Teaser : బచ్చల మల్లి టీజర్ చూసారా..?

Bachhala Malli Teaser

Bachhala Malli Teaser

అల్లరి నరేష్ (Allari Naresh) సినీ కెరియర్ ఏమాత్రం బాగాలేదు. హీరోగానే కాదు సైడ్ క్యారెక్టర్ చేసిన సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. నరేష్ నుండి ఓ హిట్ వస్తే బాగుండని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తన 62 వ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli) ఫై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సుబ్బు మంగాదేవి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. అమృత అయ్యర్ క‌థ‌నాయిక‌గా క‌నిపించ‌నున్న ఈ సినిమాను హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.

అల్ల‌రి న‌రేష్ కెరీర్‌లో 62వ సినిమా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. . రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు కీల‌క పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌ర‌పుకుంటోంది. 1990వ ద‌శ‌కంలో తుని ప్రాంతంలో జ‌రిగిన కొన్ని య‌దార్థ సంఘ‌ట‌న‌ల స్పూర్తితో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. అల్లరి నరేష్ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో మ్యాసీ హెయిర్, గడ్డంతో ఈ ఫస్ట్ లుక్‌లో కనిపించారు. ఇక ఇప్పుడు సినిమా తాలూకా టీజర్ ను గురువారం రిలీజ్ చేసి సినిమా పై ఆసక్తి నింపారు.

‘నేను ఎవ్వరి కోసం మారను నాకు నచ్చినట్లు నేను బతుకుతాను’ అంటూ నరేశ్​ రా అండ్ రస్టిక్​గా కనిపించి మెరిశారు. టీజర్ ఆద్యంతం యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్​తో సాగింది. టీజర్ పూర్తిగా నరేష్ క్యారెక్టర్ పై ద్రుష్టి పెట్టింది. మల్లి ఓ రెబల్ క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి తన మూర్ఖత్వంతో అన్నీ గొడవలే. తను ఎవరి మాట వినని సీతయ్య టైపు. మై లైఫ్ మై రూల్స్ అని బ్రతికే రకం. తన జీవితంలో ఓ ప్రేమ అధ్యాయం కూడా వుంది. చివరికి తన మూర్ఖత్వంతో జీవితం ఎలా మారింది ? తన చుట్టుపక్కన వున్న వ్యక్తులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనేది ఆసక్తిగా కట్ చేసారు. ఓ రియల్ లైఫ్ స్ఫూర్తితోనే ఈ కథని రాసుకున్నాడు సుబ్బు. టీజర్ లో ‘రా’నెస్ కనిపించింది. బచ్చల మల్లి క్యారెక్టర్ పై ఆసక్తి పెరిగింది. నరేష్ మాస్ లుక్ నేచురల్ గా వుంది. అమృత అయ్యర్ తో పాటు రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్ పాత్రలకి ప్రాధాన్యత వుంది. విశాల్ చంద్రశేఖర్ బీజీఎం బలంగా వినిపించింది. డిసెంబర్ 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read Also : Kazipet Rail Coach Factory : తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్