Site icon HashtagU Telugu

Bachchala Malli : రేపే ‘బచ్చల మల్లి’ టీజర్ వచ్చేది

Bachchala Malli Teaser

Bachchala Malli Teaser

అల్లరి నరేష్ (Allari Naresh) సినీ కెరియర్ ఏమాత్రం బాగాలేదు. హీరోగానే కాదు సైడ్ క్యారెక్టర్ చేసిన సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. నరేష్ నుండి ఓ హిట్ వస్తే బాగుండని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తన 62 వ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli) ఫై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సుబ్బు మంగాదేవి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. అమృత అయ్యర్ క‌థ‌నాయిక‌గా క‌నిపించ‌నున్న ఈ సినిమాను హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అల్ల‌రి న‌రేష్ కెరీర్‌లో 62వ సినిమా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. . రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు కీల‌క పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌ర‌పుకుంటోంది. 1990వ ద‌శ‌కంలో తుని ప్రాంతంలో జ‌రిగిన కొన్ని య‌దార్థ సంఘ‌ట‌న‌ల స్పూర్తితో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. అల్లరి నరేష్ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో మ్యాసీ హెయిర్, గడ్డంతో ఈ ఫస్ట్ లుక్‌లో కనిపించారు. ఇక రేపు నరేష్ బర్త్ డే (Naresh Birthday) సందర్బంగా టీజర్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలుపుతూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.

Read Also : UP : ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి వెళ్లిన కారు