Site icon HashtagU Telugu

Baby OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బేబీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Baby Collections

Baby Collections

చిన్న సినిమాగా విడుదలైన ముక్కోణపు ప్రేమకథ ‘బేబీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 14న థియేటర్లలో విడుదలైంది.ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్‌ని విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వైష్ణవి, ఆనంద్ దేవరకొండల నటన అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా OTTలో ఎప్పుడు వస్తుందని  ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులకు శుభవార్త.

ప్రముఖ తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’లో ‘బేబీ’ (బేబీ ది మూవీ ఆన్ ఆహా) ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ కంపెనీ ట్వీట్ చేసింది. అందరికీ “ఆహా” అంటే ఇష్టం. రేపు (శుక్రవారం) బేబీ మూవీ అప్‌డేట్ ఇవ్వబడుతుంది” .ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే వారం ‘బేబీ’ సినిమాను స్ట్రీమింగ్ కోసం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది ఆగస్టు 24 లేదా 25న ప్రసారం కావచ్చు.

సాధారణంగా ఓటీటీ సినిమాలు వారాంతాన్ని దృష్టిలో ఉంచుకుని విడుదలవుతాయి. (Baby movie ott) కానీ, ఇప్పుడు ఆ కంపెనీలు కూడా కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి కాకుండా, ముందు రోజు అంటే గురువారం రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో సినిమా చూడాలంటే అర్ధరాత్రి వరకు ఆగాల్సిన పనిలేదు. మరి ‘బేబీ’ ఏ రోజు, ఏ సమయానికి వస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Also Read: Journalists: మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం: అల్లం నారాయణ