Vaishnavi Chaitanya : బేబీ బ్యూటీకి అర కోటి ఇస్తున్నారా..?

యూట్యూబ్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. అయితే సాయి రాజేష్ డైరెక్షన్

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 04:55 PM IST

యూట్యూబ్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. అయితే సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన బేబీ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో హిట్ లో ఆమె ప్రాధాన్యత కూడా ఉంది.

వైష్ణవి పాత్రకు అమ్మడు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. బేబీ సినిమా హిట్ లో తన బాధ్యత నూటికి నూరు పాళ్లు నిర్వర్తించిన వైష్ణవి చైతన్య ఆ సినిమా హిట్ తో సూపర్ పాపులర్ అయ్యింది. ఆ సినిమా తర్వతాత వైష్ణవితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు వెంట పడుతున్నారు.

We’re now on WhatsApp : Click to Join

బేబీ కాంబోలోనే మరోసారి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా సినిమా వస్తుంది. ఆ సినిమాలో కూడా ఆనంద్ దేవరకొండతో జత కడుతుంది వైష్ణవి. ఇదే కాదు మరో సినిమా ఆఫర్ కూడా అమ్మడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలతో వైష్ణవి చైతన్య తన క్రేజ్ డబుల్ చేసుకోనుంది. ఇక ఇదిలాఉంటే ఇవే కాకుండా పూరీ జగన్నాథ్ రాం కలిసి చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా వైష్ణవి చైతన్య ఐటం సాంగ్ చేస్తుందని తెలుస్తుంది.

బేబీ హిట్ తో వైష్ణవి క్రేజ్ అమాంతం పెరిగిపోగా ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునే క్రమంలో మేకర్స్ ఉన్నారు. అందుకే రాం డబుల్ ఇస్మార్ట్ లో బేబీ వైష్ణవి మస్త్ జబర్దస్త్ ఐటం సాంగ్ ప్లాన్ చేశాడట పూరీ జగన్నాథ్. ఈ సాంగ్ తో మరోసారి అమ్మడి గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునేలా చేస్తుందని అంటున్నారు. అంతేకాదు బేబీ వల్ల వచ్చిన పాపులారిటీతో వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ కూడా బాగానే డిమాండ్ చేస్తుందని టాక్.

Also Read : Mahesh Babu Guntur Karam : గుంటూరు కారం ట్రైలర్ లో అవే ఎందుకంటే.. త్రివిక్రం తెలివైన నిర్ణయం..!

మొన్నటిదాకా ఆఫర్లు వస్తే చాలనుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు స్టార్ ఆన్ డిమాండ్ అన్నట్టుగా తను అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తాననే స్టేజ్ కి వెళ్లింది. ప్రస్తుతం వైష్ణవి చైతన్య సినిమాకు అర కోటి దాకా తీసుకుంటుందని టాక్. బేబీ సినిమా హిట్ తో పాటుగా చేస్తున్న సినిమాల్లో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా వైష్ణవి మరో 50 లక్షలు పెంచి సినిమాకు కోటి ఇస్తేనే సైన్ చేస్తాను అనే డిమాండ్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు అమ్మాయి అయిన వైష్ణవి చైతన్య ఏ తెలుగు హీరోయిన్ కూడా అందుకోలేని టాప్ రెమ్యునరేషన్ అందుకుని దుమ్ము దులిపేయాలని తెలుగు ఆడియన్స్ కోరుతున్నారు.