బాహుబలి-3 (Baahubali 3) రానుందా..ఇప్పుడు ఇదే సినీ ఇండస్ట్రీ లో అభిమానుల్లో చర్చ గా మారింది. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) – ప్రభాస్ (Prabhas) – రానా (Rana) – అనుష్క – సత్యదేవ్ కలయికలో వచ్చిన ఈ మూవీ సిరీస్ ఎంత పెద్ద విజయాలు సాధించాయో తెలియంది కాదు. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా బాహుబలి. అప్పటి వరకూ సినిమాలు ఎలా ఉన్నా.. బాహుబలి తరువాత తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెలగు సినిమాకు గుర్తింపు వచ్చింది. ప్రపంచ సినిమాచూపు మనవైపు పడేలా చేసింది. ప్రభాస్ ను సైతం పాన్ ఇండియా స్టార్ ను చేసిన సినిమా.
బాహుబలి సినిమాను తెలుగు ప్రజల మర్చిపోలేరు.. పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఎప్పటికీ గుర్తుంచుకునేలా అద్భుతంగా తెరకెక్కించాడు జక్కన్న. ప్రభాస్ హీరోగా.. రాజమౌళి దర్శకంత్వంలో రూపొందిన బాహుబలి.. రానా అద్భుతమైన నటన, అనుష్క, తమన్నా గ్లామర్.. శివగామిగా రమ్య కృష్ణ పెర్ఫామెన్న్స్.. సినిమాకు ప్రాణం పోశాయి. ఆడియన్స్ లో చెరగనిముద్ర వేశాయి. ఈ సినిమా తెలుగు చలనచిత్ర రికార్డులను బద్దలు కొట్టింది. బాహుబలి రెండు సినిమాల తరువాత మూడో పార్ట్ కూడా కావాలి అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుండో కోరుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా కు మూడో సీక్వెల్ గా రాబోతున్నట్లు ఓ వార్త బయటకు రావడం అభిమానుల్లో సంబరాలు నింపుతుంది.
తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) ఓ ఇంటర్వ్యూలో .. బాహుబలి నిర్మాతలతో తాను ఇటీవల మాట్లాడినప్పుడు బాహుబలి-3 తీయనున్నట్లు అన్నారని పేర్కొన్నారు. దీంతో ఈ విషయం సినీ ప్రియుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి సిరీస్లను తమిళంలో జ్ఞానవేలే సమర్పించారు. మరి నిజంగా బాహుబలి 3 తెరక్కిస్తున్నారా..? అది సాధ్యమవుతుందా..? మూడో పార్ట్ అంటే దీని గురించి తీస్తారు..? అంటూ ఇప్పటి నుండే అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి..మహేష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. జనవరి లో ఈ మూవీ సెట్స్ పైకి రానుందని సమాచారం.
Read Also : Relieves AP Cadre IAS Officers: తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఏపీ ఐఏఎస్‌లు.. జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్!