‘సంక్రాంతికి వస్తున్నాం’..’సంక్రాంతికి వస్తున్నాం’..’సంక్రాంతికి వస్తున్నాం’ (sankranthiki vasthunnam) ఇప్పుడు ఎక్కడ చూడు ఇదే మాట వినిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు అంత ఈ సినిమా చూసేందుకు ఉత్సాహం కనపరుస్తున్నారు. సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్నా ఇంకా టికెట్స్ దొరకని పరిస్థితి. ప్రతి రోజు టికెట్స్ కోసం థియేటర్స్ కు క్యూ కడుతున్న వారు ఉన్నారు. అంతే ఎందుకు టికెట్స్ కోసం రాజకీయ నాయకులను కూడా అరా తీస్తున్నారంటే అర్ధం చేసుకోవాలి.
సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలను పక్కకు నెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా థియేటర్ మొహం చూడని వారు సైతం ఈసారి సంక్రాంతి సినిమాను థియేటర్‌లో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎక్కడ చూడు థియేటర్లు అన్ని ఫ్యామిలీ ఆడియన్స్‌తో కిటకిటలాడుతున్నాయి.
Jammu Kashmir : ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీ జవాన్ మృతి
దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. తెలుగు సినిమా రికార్డ్స్ ను తిరగరాసిన బాహుబలి 2 రికార్డ్స్ ను సైతం సంక్రాంతికి వస్తున్నాం బ్రేక్ చేసిందంటే ఆషామాషీ కాదు. ఏపీలోని మండపేటలో బాహుబలి 2 సినిమా లాంగ్ రన్‌లో రూ.90 లక్షలు వసూళ్లు చేసింది. అల వైకుంఠపురంలో రూ.68 లక్షల వసూళ్లు నమోదు చేసింది. ఆ రెండు సినిమాలు లాంగ్ రన్‌లో రాబట్టిన వసూళ్లను సంక్రాంతికి వస్తున్నాం సినిమా 10 రోజుల లోపే బ్రేక్ చేయడం విశేషం. కేవలం మండపేటలో ఈ సినిమా రూ.కోటి వసూళ్లు సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. వీరి మధ్య సాగే సన్నివేశాలు, బుల్లి రాజు, జైలర్ ఇలా ప్రతి పాత్ర సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ఇక భీమ్స్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫస్ట్ హాఫ్ గ్యాప్ లేకుండా కామెడీ సీన్స్‌తో సాగింది. సెకండ్ హాఫ్‌లో కాస్త స్లో అయినా ఓవరాల్‌గా సినీ లవర్స్ కు మంచి వినోదాన్ని అందించి సక్సెస్ సాధించింది.