Site icon HashtagU Telugu

Avneet Kaur : హాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ భామ..? టామ్ క్రూయిజ్ తో అవనీత్ కౌర్..

Avneet Kaur

Avneet Kaur

Avneet Kaur : ఇటీవల పలువురు ఇండియన్ యాక్టర్స్ హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ భామ అవనీత్ కౌర్ హాలీవుడ్ సినిమాలో నటించిందా అనే వార్తలు వస్తున్నాయి. నటిగా సినిమాలు, సీరియల్స్, సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది అవనీత్ కౌర్. తాజాగా అవనీత్ కౌర్ హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్ ని కలిసిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

టామ్ క్రూయిజ్ అనేక హాలీవుడ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలతో ఇండియాలో కూడా బోలెడంత ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో ఏడు సినిమాలు రాగా అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఈ సిరీస్ లో చివరి సినిమా మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రాకింగ్ త్వరలోనే రానుంది. నిన్నే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రాకింగ్ సినిమా 2025 మే 23 న రిలీజ్ కానుంది.

తాజాగా అవనీత్ కౌర్ మిషన్ ఇంపాజిబుల్ సెట్స్ లో టామ్ క్రూయిజ్ తో కలిసి దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. టామ్ క్రూయిజ్ ని కలిసాను. మిషన్ ఇంపాజిబుల్ సెట్ ను సందర్శించాను అంటూ సంతోషంతో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక అవనీత్ ఫ్యాన్స్ టామ్ క్రూయిజ్ ని కలిసావు అంటూ ఆమెని అభినందిస్తున్నారు. అయితే అవనీత్ మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో నటించిందా లేక ప్రమోషన్స్ లో భాగంగా టామ్ క్రూయిజ్ ని కలిసిందా అనేది తెలీదు. మరి ఈ హాలీవుడ్ సినిమాలో ఈ బాలీవుడ్ భామ ఉందా లేదా చూడాలి.

 

Also Read : Satyadev : RRR సినిమాలో సత్యదేవ్.. ఎడిటింగ్ లో తీసేసిన రాజమౌళి..