చిన్నారి పెళ్లికూతురు (Chinnari pellikuturu) సీరియల్ తో సూపర్ పాపులారిటీ సంపాదించిన అవికా గోర్ తెలుగులో ఉయ్యాల జంపాల తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నుంచి ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చిన ఈ అమ్మడు స్టార్ క్రేజ్ తెచ్చుకోలేదు. ఐతే తెలుగుతో పాటు అటు బాలీవుడ్ లో కూడా అమ్మడు తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మధ్యలో తన లుక్స్ వల్లే ఆఫర్లు రావట్లేదేమో అనుకుని బొద్దుగా ఉన్న అమ్మడు సన్నగా మారి సర్ ప్రైజ్ చేసింది.
ఐతే సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించిన అవికా గోర్ తను ఉద్యోగం ఇచ్చిన వాడే తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది.
తన బాడీ గార్డ్ తనని చెప్పుకోలేని చోట టచ్ చేశాడని చెప్పింది అవికా గోర్. తనని కొట్టే ధైర్యం లేక అతన్ని కొట్టలేదని చెప్పిన అమ్మడు. అలా ధైర్యం ఉంటే చాలామందిని కొట్టేదాన్ని అని చెప్పింది అవికా గోర్.
24 మ్యాన్షన్ తో పాటు వరుడు..
ఈమధ్య అమ్మడు కొన్ని వెబ్ సీరీస్ (Web Series) లలో నటించింది. 24 మ్యాన్షన్ (24 Mansion) తో పాటు వరుడు అనే వెబ్ సీరీస్ తో మెప్పించింది. ముఖ్యంగా థ్రిల్లర్ కథలు అంటే చాలు అవికా గోర్ (Avika Gor) ని ఫిక్స్ చేస్తున్నారు.
సౌత్ సినిమాలతో పాటు అటు బాలీవుడ్ లో కూడా ఎలాంటి అవకాశం వచ్చినా చేసేందుకు అమ్మడు సై అనేస్తుంది. కొన్నాళ్లు డేటింగ్ చేస్తుందని వార్తల్లో నిలిచిన అవికా మళ్లీ నటిగా బిజీ అవ్వాలని చూస్తుంది.
Also Read : Mokshagna : స్టార్ తనయురాలితో మోక్షజ్ఞ జోడీ..!