Site icon HashtagU Telugu

Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ పై దాడి

Attack On Saif Ali Khan

Attack On Saif Ali Khan

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌( Saif Ali Khan)పై దాడి (Attack ) జరగడం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. ముంబై బాంద్రాలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి (Robbery ) యత్నించి, సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడి జరిగినప్పుడు సైఫ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఓ దొంగ వారి ఇంట్లోకి చొరబడి, దొంగతనానికి ప్రయత్నించాడు. ఆ అలికిడి చూసి మేల్కొన్న సైఫ్, దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.

BrahMos Deal : భారత్‌తో ఇండోనేషియా బిగ్ డీల్.. రూ.3,800 కోట్ల బ్రహ్మోస్ క్షిపణులకు ఆర్డర్ ?

ఈ దాడిలో సైఫ్ అలీఖాన్‌కు ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆయనకు చికిత్స కొనసాగుతుండగా, పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో కరీనా కపూర్ మరియు వారి పిల్లలు క్షేమంగా ఉన్నారు. పోలీసులు సైఫ్ నివాసానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, దొంగను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన సైఫ్ కుటుంబంలో తీవ్ర ఆందోళన కలిగించింది. దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. సైఫ్ అలీఖాన్ కుటుంబం ఈ దాడి విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బాలీవుడ్‌లో ఈ సంఘటనపై విస్తృత చర్చ నడుస్తోంది. సైఫ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు.