Site icon HashtagU Telugu

Hyderabad : పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్‌ ఇంటి‌పై దాడి..

Attack On Pawan Kalyan's Se

Attack On Pawan Kalyan's Se

పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్‌ (Pawan Kalyan Security Guard) ఇంటి‌పై దాడి జరిగిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఏపీలో పోలింగ్ పూర్తి అయినా తర్వాత పెద్ద ఎత్తున టిడిపి నేతలఫై , కార్యకర్తలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్‌ వెంకట్ (Venkat) ఇంటిపై దాడి జరిగిన వార్త వైరల్ గా మారింది. కాకపోతే ఇది రాజకీయపార్టీలు చేసిన పని కాదు..పక్కంటి వారు చేసిన దాడి.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్ మీర్‌పేట్‌లోని లెనిన్ నగర్‌లో వెంకట్ తన భార్య సరితతో కలిసి ఐదేళ్లుగా వారి ఇద్దరు పిల్లలతో కలిసి లెనిన్ సెంటర్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో వారి ఇంటి ఎదురుగా ఉండే రాజు వాళ్ల బంధువులు పాత గొడవల నేపథ్యంలో మే 15న రాత్రి వెంకట్ కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో వెంకట్ భార్య..ఓ అబ్బాయిని కొట్టింది. దీంతో కోపోద్రిక్తులైన రాజు బంధువులు వెంకట్ ఇంటిపై కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడి చేసి ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమే కాదు వెంకట్ కుటుంబసభ్యులపైనా కూడా దాడి చేసారు. దీనిపై వెంకట్ పోలీసులకు పిర్యాదు చేసాడు. తమ అభిమాన నటుడికి సెక్యూరిటీ గార్డుపై పనిచేస్తున్న వ్యక్తిపై దాడి నేపథ్యంలో పవన్ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు.

Read Also : IPL 2024 : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..ఉప్పల్ లో మ్యాచ్ జరిగేనా..?