Site icon HashtagU Telugu

Simran Budharup : ఫేమస్ వినాయక మండపంలో నటిపై దాడి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి..

Attack on Bollywood Actress Simran Budharup at Mumbai Lal Baug Cha Ganesh

Simran Budharup

Simran Budharup : ప్రస్తుతం దేశమంతా వినాయక చవితి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది ముంబై మాత్రమే. ముంబైలో ఘనంగా వినాయకచవితి సెలబ్రేషన్స్, నిమజ్జనం చేస్తారు. ముంబైలో కొన్ని ఫేమస్ వినాయక మండపాలు ఉన్నాయి. అందులో లాల్ బాగ్‌చ వినాయక మండపం ఒకరి. ఇక్కడికి అంబానీ నుంచి సినీ, రాజకీయ, క్రికెట్ సెలబ్రిటీలు అందరూ వచ్చి వినాయకుడి ఆశీర్వాదం తీసుకుంటారు.

అయితే లాల్ బాగ్‌చ వినాయక దర్శనానికి ఓ టీవీ యాక్టర్ సిమ్రాన్ బుదరపు తన తల్లితో కలిసి వచ్చింది. బాలీవుడ్ లో పలు టీవీ షోలు, సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది సిమ్రాన్ బుదరపు. లాల్ బాగ్‌చ వినాయక దర్శనానికి సిమ్రాన్ తన తల్లితో కలిసి లైన్ లో వెళ్తుండగా తన తల్లి వినాయకుడిని ఫొటోలు తీస్తుంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ ని లాక్కున్నారు. దీంతో సిమ్రాన్ తల్లి ఆ ఫోన్ తీసుకోడానికి ప్రయత్నించగా ఆమెని తోసేశారు. దీంతో సిమ్రాన్ ఆ గొడవలోకి రాగా ఆమెతో అక్కడి మహిళా సిబ్బంది మిస్ బిహేవ్ చేసి తోసేశారు. ఈ గొడవ అంతా వీడియో తీయడానికి ట్రై చేస్తే సిమ్రాన్ ఫోన్ కూడా లాక్కోడానికి ప్రయత్నించి ఆమెపై దాడి చేసారు.

దీనికి సంబంధించిన ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఈ ఘటన గురించి చెప్పింది సిమ్రాన్. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా లాల్ బాగ్‌చ వినాయక మండపం సిబ్బందిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇటీవల లాల్ బాగ్‌చ వినాయక మండపంపై విమర్శలు వస్తున్నాయి. VIP లను ఒకలాగా ట్రీట్ చేస్తూ, సామాన్య భక్తులను తోసేస్తూ వారితో మిస్ బిహేవ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నటి ఇలా పోస్ట్ చేయడంతో లాల్ బాగ్‌చ వైరల్ గా మారింది. మరి దీనిపై అక్కడి నిర్వాహకులు స్పందిస్తారేమో చూడాలి.

 

Also Read : Amala Paul : మొదటిసారి కొడుకు ఫేస్ చూపించిన అమలాపాల్.. ఓనమ్ స్పెషల్ ఫ్యామిలీ ఫొటోస్..