Site icon HashtagU Telugu

Bollywood: అట్లీ నెక్ట్స్ హీరో ఎవరు?

Bollywood

New Web Story Copy 2023 09 13t182306.859

Bollywood: దర్శకుడు అట్లీ బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయ్యాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు దాటింది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండగానే అట్లీ తదుపరి సినిమా గురించి చర్చ మొదలైంది. నటుడు ఆయుష్మాన్ ఖురానాతో అట్లీ జతకట్టనున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి.

తాజాగా ఆయుష్మాన్ ఖురానా మీడియా వేదికగా మాట్లాడుతూ.. డిఫరెంట్ సినిమాలు చేయాలనుకుంటున్నాను అని ఆయుష్మాన్ అన్నారు. సౌత్ ఇండియా సినిమాలు రీమేక్ అవుతుంటాయి. అట్లీ లేదా ఫహద్‌తో సినిమా చేయాలనుకుంటున్నాను అని ఆయుష్మాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయుష్మాన్ ఈ స్టేట్మెంట్ బాలీవుడ్ లో చర్చకు దారి తీసింది. అట్లీ లాంటి దర్శకుడు కథ చెప్తే ఆయుష్మాన్ రిజెక్ట్ చేసే అవకాశముండదు. సో మొత్తానికి ఈ కాంబో మరో సెన్సేషన్ కాబోతుందంటున్నారు సినిమా క్రిటిక్స్.

అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ కమర్షియల్ యాంగిల్ లో రికార్డుల మోత మోగిస్తుంది. కింగ్ ఖాన్ నటన సినిమాకే హైలెట్ అంటున్నారు. దీపికా పడుకునేతో పోరాట సన్నివేశాలు, నయనతారతో రొమాన్స్ సీన్స్ అద్భుతంగా కుదిరాయి. ప్రస్తుతం అట్లీ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే ఆయన తదుపరి చిత్రం గురించి క్లారిటీ ఇవ్వనున్నాడు.

Also Read: Hyderabad: క్వాంట‌మ్ కార్యాల‌యాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి