Site icon HashtagU Telugu

AA22: కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారంటూ ‘AA22’పై అంచనాలు పెంచిన అట్లీ

Atlee Bunny Movie Update

Atlee Bunny Movie Update

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘AA22’ ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు సృష్టించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అట్లీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో సినిమా పట్ల ఉన్న నిబద్ధత, విజన్ స్పష్టంగా కనిపించింది. “ప్రేక్షకులు ఊహించని ఒక కొత్త ప్రపంచాన్ని మేము సృష్టిస్తున్నాం. ఇది కేవలం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కాదు, ఇది ఒక ఎమోషనల్ జర్నీ కూడా అవుతుంది” అని అట్లీ అన్నారు. అల్లు అర్జున్ నటనకు సరిపోయేలా ఒక విభిన్నమైన స్క్రీన్‌ప్లేను రూపొందించినట్లు తెలిపారు.

Google : నోరూరిస్తోన్న గూగుల్‌ ఇడ్లి డూడుల్‌.. మీరు ఓ లుక్కేయండి !

అట్లీ దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం కూడా తనదైన ముద్రను వేసుకుంది. ‘AA22’ విషయంలో అయితే ఆయన ఇంకా పెద్ద స్థాయిలో ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. “ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది కేవలం పెద్ద బడ్జెట్ సినిమా కాదు, భావోద్వేగాలు, స్టైల్, స్పెక్టకిల్ ” అని ఆయన పేర్కొన్నారు. సినిమాటిక్ యూనివర్స్ తరహాలో ఈ కథను నిర్మిస్తున్నారని, ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుందని చెప్పారు.

ఇంత భారీ స్థాయిలో రూపొందుతున్న ప్రాజెక్ట్ అయినా కూడా అట్లీ దాన్ని రిస్క్‌గా కాకుండా ఓ ఎంజాయ్‌మెంట్‌గా చూస్తున్నారు. “ప్రతి రోజు సెట్‌లోకి వెళ్లడం అంటే ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టినట్టే ఉంటుంది. ఈ ప్రయాణాన్ని నేను పూర్తి మనసుతో ఆస్వాదిస్తున్నాను,” అని ఆయన అన్నారు. తాము సృష్టిస్తున్న ఈ ప్రపంచాన్ని ప్రేక్షకులు పెద్ద తెరపై అనుభవించడానికి ఇంకా కొద్దిమాసాల సమయం పట్టవచ్చని వెల్లడించారు. అభిమానులందరికీ “ఇంకా కొంత సమయం వేచి చూడండి, మేము సృష్టిస్తున్న మేజిక్‌ను మీరు చూసి ఆశ్చర్యపోతారు” అంటూ అట్లీ హామీ ఇచ్చారు.

Exit mobile version