Site icon HashtagU Telugu

Ashu Reddy : నా బాడీ సూపర్ డీలక్స్ అంటున్న అషు రెడ్డి..!

Ashu Reddy First Look From Yevam Movie

Ashu Reddy First Look From Yevam Movie

Ashu Reddy జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకుంది. కొన్నాళ్లు బుల్లితెర మీద షోలు చేసిన అమ్మడు ఆర్జీవితో కలిసి చేసిన ఇంటర్వ్యూ ఆమెను వైరల్ అయ్యేలా చేసింది. తన ఇన్ స్టాగ్రాం లో హాట్ ఫోటో షూట్ తో ఫాలోవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వచ్చిన అషు రెడ్డి సినిమాల విషయంలో అంత సీరియస్ గా లేకపోయినా వచ్చిన అవకాశాలను చేస్తూ వస్తుంది. అషు రెడ్డి పద్మవ్యూహంలో చక్రధారి సినిమా చేస్తుండగా మరో సినిమా యేవం లో కూడా నటిస్తుంది.

ప్రకాష్ దంతులూరి డైరెక్షన్ లో వస్తున్న యేవం సినిమాలో చాందిని చౌదరి లీడింగ్ లేడీగా నటిస్తుంది. ఈ సినిమా నుంచి అషు రెడ్డి ఫస్ట్ లుక్ రిలీజైంది. నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ చెయిర్ లో హాట్ స్టిల్ తో కనిపించింది అషు రెడ్డి. అంతకుముందు సినిమాలు ఏమో కానీ ఈ సినిమాలో అషు రెడ్డి పాత్రకు మంచి గుర్తింపు వచ్చేలా ఉంది.

ముఖ్యంగా యేవం టైటిల్ కు నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ అషు రెడ్డి పొస్టర్ కు ఏమాత్రం పొంతన కుదరట్లేదు. ఇంతకీ అసలు ఈ యేవం కథ ఏంటి పొస్టర్ లో అషు ని చూపిస్తూ బాడీ సూపర్ డీలక్స్ అన్న కామెంట్ ఎందుకు పెట్టారు అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఫోకస్ చేస్తున్న అషు రెడ్డి సీరియస్ గా ప్రయత్నిస్తే మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.

Also Read : Chiranjeevi – NTR : రాఖీ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి చిరంజీవి ఏమ్మన్నారంటే..