Ashika Ranganath టాలీవుడ్ లో కన్నడ భామలకు బాగా కలిసి వస్తుంది. అక్కడ నుంచి వచ్చిన తారామణులు చాలామంది తెలుగులో స్టార్డం తెచ్చుకున్న వారు ఉన్నారు. అప్పటి సౌందర్య నుంచి రష్మిక మందన్న వరకు కన్నడ నుంచి వచ్చి ఇక్కడ సత్తా చాటిన వారే.
We’re now on WhatsApp : Click to Join
ఇక ఇప్పుడు అదే క్రమంలో మరో కన్నడ భామ తెలుగు దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటుంది. ఆమె ఎవరో కాదు ఆషిక రంగనాథ్. ఆల్రెడీ కళ్యాణ్ రాం తో అమిగోస్ సినిమా చేసిన ఆషిక ఆ సినిమా ఫ్లాప్ తో ఎవరికి తెలియలేదు కానీ కింగ్ సినిమాతో అమ్మడు లైం లైట్ లోకి వచ్చింది.
నాగార్జున హీరోగా విజయ్ బిన్ని డైరెక్షన్ లో వచ్చిన నా సామిరంగ (Na Samiranga) సినిమాలో వరలక్ష్మి పాత్రలో నటించిన ఆషిక రంగనాథ్. సినిమాలో తన పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకుంది ఆషిక రంగనాథ్. అంతేకాదు సినిమా చూసిన వాళ్లంతా కూడా ఆషిక గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
ఈతరం హీరోయిన్స్ సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ఛాన్స్ వచ్చిందా చేసేద్దాం అనేలా ఉన్నారు. కొందరు హీరోయిన్స్ సీనియర్ హీరో పక్కన చేయాలంటే ఆలోచిస్తారు కానీ ఆషిక అలా చేయలేదు.
Also Read : Deepika Padukone : దీపికా పదుకొనె మరో సౌత్ సినిమా.. ఈసారి ఆ స్టార్ తో రొమాన్స్..!
నాగార్జున (Nagarjuna) సరసన లక్కీ ఛాన్స్ అందుకున్న అమ్మడు ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. నా సామిరంగ సినిమాలో ఆషికని చూసిన వారంతా కూడా సీనియర్ స్టార్స్ కి మరో పర్ఫెక్ట్ హీరోయిన్ దొరికేసిందని అంటున్నారు. ఎలాగు నా సామిరంగ హిట్ అయ్యింది కాబట్టి అమ్మడి డిమాండ్ కూడా బాగానే ఉంటుంది. మరి ఆషికకు ఎలాంటి ఛాన్స్ లు వస్తాయో చూడాలి.
