Site icon HashtagU Telugu

Tollywood : ‘ఒరేయ్ నియ్యబ్బా..’ అంటూ హీరో గోపీచంద్ ఫై ఎ.ఎస్.రవికుమార్ సంచలన వ్యాఖ్యలు

as ravi kumar chowdary comments on gopichand

as ravi kumar chowdary comments on gopichand

ప్రముఖ డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ (AS Ravi Kumar Chowdary)..హీరో గోపీచంద్ (Hero Gopichand) ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. ‘ఒరేయ్ నియ్యబ్బా..అంత బలిసిపోయిందారా నీకు’..రవికుమార్ చౌదరి వచ్చాడండి అంటే.. ఆహా, కాసేపు వెయిట్ చేయమను అంటావా..నువ్వు నా ఇంటికి వచ్చావ్.. నా బర్త్‌డేకి వచ్చావ్.. నా పెళ్లికొచ్చావ్.. నేను దగ్గినా వచ్చావ్.. తుమ్మినా వచ్చావ్.. అలాంటిది నేను నీ దగ్గరికి రావాలంటే ఐదారుగురిని దాటుకొని రావాలా?’ అంటూ ఇన్ డైరెక్ట్ గా గోపీచంద్ ఫై ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఎ.ఎస్.రవికుమార్ చాల గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా పెట్టి ‘తిరగబడరా సామి’ (Tiragabadara Saami) అనే మూవీ ని డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రాన్ని సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మించారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను సోమవారం విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మన్నారా చోప్రా (Mannara Chopra) బుగ్గ ఫై డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ముద్దు (AS Ravi Kumar Kiss) పెట్టి వార్తల్లో నిలిచారు. పబ్లిక్ గా ఇలా హీరోయిన్ కు ముద్దు పెట్టడం ఏంటి అని అంత విమర్శలు చేస్తున్న తరుణంలో..ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరో గోపీచంద్ ఫై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రవికుమార్ ను మరింతగా వారాంతాల్లో నిలిచేలా చేసింది.

Read Also : Posani Krishna Murali: బన్నీ ఇంటికి పిలిచి రూ.5 లక్షలు ఇచ్చాడు: పోసాని

2002లో వచ్చిన ‘మనసుతో’ అనే సినిమాతో డైరెక్టర్ గా చిత్రసీమలో రవికుమార్ పరిచమయ్యారు. ఆ తర్వాత ‘యజ్ఞం’ (Yagnam) సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతోనే గోపీచంద్‌కు కూడా హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ‘యజ్ఞం’ తరవాత గోపీచంద్ మాస్ హీరో అయిపోయాడు. కానీ రవికుమార్ మాత్రం పెద్దగా సినిమాల్లేక..ఛాన్సులు రాక ఖాళీగా ఉన్నారు. చాల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘తిరగబడరా సామి’ సినిమాతో రాబోతున్నాడు. అయితే గోపీచంద్ ను మాస్ హీరోగా చేసి బిజీ యాక్టర్ ను చేస్తే..ఆ తర్వాత తనను పట్టించుకోలేదని ఇన్ డైరెక్ట్ గా ఆయనపై విమర్శలు చేసారు. అంతకుముందు చెట్టు కిందే కూర్చొని అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. ఒరేయ్ నియ్యబ్బా.. ఇప్పుడు క్యారవాన్‌లు. రవికుమార్ చౌదరి వచ్చాడండి అంటే.. ఆహా, కాసేపు వెయిట్ చేయమను. ఒరేయ్.. అంత బలిసిపోయిందారా నీకు. తప్పండి. నువ్వు నా ఇంటికి వచ్చావ్.. నా బర్త్‌డేకి వచ్చావ్.. నా పెళ్లికొచ్చావ్.. నేను దగ్గినా వచ్చావ్.. తుమ్మినా వచ్చావ్.. అలాంటిది నేను నీ దగ్గరికి రావాలంటే ఐదారుగురిని దాటుకొని రావాలా?’ అంటూ గోపీచంద్ పేరు చెప్పకుండానే ఆయనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు.

అంతే కాకుండా ‘వాడొక హీరో.. వాడిని హీరోగా నేనే చేశాను. విలన్‌గా యాక్ట్ చేస్తున్నప్పుడు నేను హీరోని చేశాను. నెక్ట్స్ సినిమాకి నా రెమ్యునరేషన్ కంటే అతని రెమ్యునరేషన్ చాలా తక్కువ. మరి ఆ బలుపులు ఎందుకొస్తాయో అర్థంకాదు. వాడు నాకు ఎదురుపడితే ఇలాగే మాట్లాడతాను. అది వాళ్లకు నచ్చితే నాతో ఉంటారు. నచ్చకపోతే.. ఆల్‌రెడీ పోతున్నారులే వాళ్ల తోవలో’ అంటూ గోపీచంద్‌పై రవికుమార్ చౌదరి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రవికుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ ఎఫెక్ట్ ఆయన సినిమా ఫై..తదుపరి సినిమా ఛాన్సుల ఫై ఎంతగపడతాయో చూడాలి.